వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజించే స్త్రీలపై అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు: దిశ ఎన్‌కౌంటర్ త్రిసభ్య కమిటీ సభ్యుడు కార్తికేయన్

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ సభ్యుడుగా ఉన్న కార్తీకేయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగడంపై ఆయన తీవ్ర ఆవేదం వ్యక్తం చేశారు. భారత దేశంలో స్త్రీలను దేవతామూర్తులుగా కీర్తించే భారత దేశంలో వారిపై అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని ఆయన అభివర్ణించారు.. అయితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కోర్టులు గాని, పోలీసులుగాని కట్టడి చేయలేకపోతున్నారని ఆయన అన్నారు.

ఎన్‌కౌంటర్‌పై విచారణ కమీషన్

ఎన్‌కౌంటర్‌పై విచారణ కమీషన్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత అనేక అనుమానాలు ,పిటిషన్ల నేపథ్యంలోనే నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.... ఇందుకోసం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా నియమిస్తూ...సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బోబ్డే అదేశాలు జారీ చేశారు. కాగా మొత్తం ఎన్‌కౌంటర్ సంఘటనపై ఆరు నెలల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మహిళలకు అనుగుణంగా కార్తికేయన్ వ్యాఖ్యలు

మహిళలకు అనుగుణంగా కార్తికేయన్ వ్యాఖ్యలు

దీంతో విచారణ కమిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడ ఏర్పాట్లు చేసింది. వారు రాష్ట్రంలో ఉండి విచారణ చేసేందుకు అన్ని వసతులను సిద్దం చేసింది. అయితే కమిటీ మాత్రం ఇంకా రాష్ట్రంలో పర్యటించడం లేదు..కాని త్రిసభ్య కమిటీలో సభ్యుడుగా ఉన్న సీబీఐ మాజీ డైరక్టర్ కార్తికేయన్, రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మహాపిరమిడ్ 2019కి ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. కాగా రెండు రోజులుగా అక్కడ జరిగే అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటున్న కార్తీకేయన్ మహిళలకు అనుగుణంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్తికేయన్ వ్యాఖ్యలు, పోలీసులకు ఊరట

కార్తికేయన్ వ్యాఖ్యలు, పోలీసులకు ఊరట

ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఎన్‌కౌంటర్ జరిగిన తీరును వ్యక్తిగతంగా సమర్ధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళలు పోలీసుల తీరుపై దుమ్మెత్తి పోశారు. ప్రజల ఆందోళనలతో పోలీసులపై ఒత్తిడి పెరగడంతో ఎన్‌కౌంటర్‌లో నిందితులు మృత్యువాత పడ్డారు. అయితే... ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత తెలంగాణ పోలీసులకు వివిధ రాష్ట్రాల నుండి మద్దతు కూడ పలికారు. ఈ నేపథ్యంలోనే వారిపై ఎన్‌కౌంటర్ స్థలంలోనే పూల వర్షం కురిసింది. అయితే అనంతరం జరిగిన పరిణామాల్లో పోలీసుల చుట్టు రాజ్యంగ పరమైన చిక్కులు చుట్టుముట్టాయి. దీంతో కమీషన్ వేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంతో... ఎం తేలుస్తారో అనే ఉత్కంఠ రాష్ట్ర పోలీసుల్లో నెలకొంది. ఇక కార్తీకేయన్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల్లో కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Karthikeyan, who is a member of the inquiry committee IN Disha encounter , expressed deep concern over the rape and murder of women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X