సీఎం నిర్లక్షం వలనే 100 మందికి బెయిల్ వచ్చింది, ఫలితం అనుభవిస్తారు, కేంద్ర మంత్రి ఫైర్ !
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల పాత హుబ్బళి అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైందని, రానున్న రోజుల్లో దీని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి ముస్లీంల మీద, నిందితుల మీద సానుభూతి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులో సరిగా వాదించకుండానే నిందితులకు సులభంగా బెయిల్ వచ్చేలా సిద్దరామయ్య ప్రభుత్వం చూసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. నిందితులను బెయిల్‌పై విడుదల చేయాలని, కేసు నుంచి విముక్తి కల్పించాలని గతంలో కొందరు నేతలు సిద్దరామయ్య ప్రభుత్వానికి లేఖల ద్వారా అభ్యర్థించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

పాత హుబ్బళి అల్లర్ల కేసులో నిర్బంధించిన వారిపై దేశద్రోహం సహా అనేక ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిందితులకు బెయిల్ మంజూరు అయ్యేలా చేసిందని, రానున్న రోజుల్లో సిద్దరామయ్య ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాత హుబ్బళి అల్లర్ల కేసులో ముగ్గురు మినహా 105 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది పది నెలల క్రితం పాత హుబ్బళిలో హిందూ-ముస్లీం వర్గాల మధ్య గొడవలు జరిగాయి.
వాట్సాప్ స్టేటస్ విషయంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా కొందరు పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్ ముందు కూడా వీరంగం సృష్టించారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. 2022 ఏప్రిల్ 16వ తేదీన బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్లిలో జరిగిన గొడవల తరహాలో పాత హుబ్బళిలో గొడవలు జరిగాయి. పాత హుబ్బళి కేసుల్లో మొత్తం 152 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

పాత హుబ్బళి పోలీస్ స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు 105 మంది యువకులు జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ముగ్గురి కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ రావడం ఆలస్యమైంది. ఈ ఘర్షణలో 10కి పైగా పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సహా ఏడుగురు పోలీసులపై అల్లరిమూకలు దాడి చేశారు. జువైనల్‌లతో సహా 152 మందిలో 10 మందికి గతంలో బెయిల్ మంజూరైంది. రెండు నెలల క్రితం సుప్రీంకోర్టులో 35 మందికి బెయిల్ మంజూరైంది. ముగ్గురికి తప్ప ఇప్పుడు ఈ కేసుల్లో అందరికి బెయిల్ మంజూరైంది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరగవా..? ఢిల్లీ మార్క్ ట్విస్ట్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications