కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసు: విజయ్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ/బెంగళూరు: బ్యాంకులకు సుమారు 9వేలకోట్ల రూపాయల ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు మాల్యాతోపాటు మరో 18మందికి ఈ వారెంట్ జారీ చేసింది.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఈ మేరకు చర్య తీసుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో చోటుచేసుకున్న అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేగాకుండా, 19 సంస్థలపై 'ప్రత్యేక నేర కేసు' నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications