వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్‌న్యూస్: బహిరంగ మార్కెట్‌లో కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇవ్వడంపై డీసీజీఐ అనుమతి

|
Google Oneindia TeluguNews

కరోనాకు టీకాతోనే చెక్ పెట్టాలి.. ఇప్పటికే మెజార్టీ ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే బూస్టర్ డోసు ప్రాసెస్ కూడా జరుగుతుంది. సెకండ్ డోసు.. బూస్టర్ డోసుకు మధ్యల 9 నెలల గడువు ఉండాలని అంటున్నారు. దీంతో ప్రైవేట్‌లో కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ నిర్ణీత సమయంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకురావడంపై డీసీజీఐని అనుమతి కోరగా.. అందుకు అనుమతి ఇచ్చింది.

కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ వంద శాతం పూర్తి కాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో డబుల్ డోసులు వంద శాతానికి చేరువగా ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు ఇతర కొన్ని కంపెనీల డోసులు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బహిరంగ మార్కెట్ లో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. డీసీజీఐ నుంచి అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి.

Covaxin, Covishield granted market approval in India

టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ. 275గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రూ. 150 సేవా రుసుము అదనంగా విధించే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రైవేటు లో కోవాగ్జిన్ ఒక డోసు ధర రూ. 1200, కోవిషీల్డ్ రూ. 780 (సేవా రుసుంతో కలిపి) ఉంది. గత సంవత్సరం జనవరి 3వ తేదీన అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9వ తేదీన ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. సాధారణ అనుమతి కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అవసరమైన సమాచారం ఇచ్చింది.

భారత్ లో తయారయ్యే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలనే అంశంపై నివేదిక ఇవ్వాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీను డీసీజీఐ కోరింది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలు / ఏడాది కాలం వ్యవధిలో బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. టీకాలు ప్రజలందరికీ చేరువయ్యేలా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయడం ఉత్తమం అని ఫార్మా సంస్థలు భావించాయి. దాంతో అనుమతి కోరగా.. ఇచ్చాయి.

English summary
India's drug regulator granted market approval for Covid-19 vaccines Covishield and Covaxin for use in the adult population subject to certain conditions on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X