బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఒక్క రోజులో 45 మందికి కరోనా పాజిటివ్, బెంగళూరులో 163, పేషంట్ నెంబర్. 533 దెబ్బ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని అంతం చెయ్యడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాపకింద నీరులా కరోనా వైరస్ ఓ చైన్ లింక్ లా ఎవరికి పడితే వారికి వ్యాపిస్తోంది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోయాయి. ఒక్కరోజులో 45 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. కరోనా వైరస్ వచ్చిన వారిలో మహిళలు ఎక్కువ మంది ఉండంటం మరింత ఆందోళనకు గురి చేసింది. బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 163కు చేరింది. పేషంట్ నెంబర్: 533 దెబ్బకు 10 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !

ఒక్క రోజులో 45 మందికి కరోనా

ఒక్క రోజులో 45 మందికి కరోనా

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కన్నడిగుతో పాటు ఆ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు వెళ్లడించింది. ఒక్కరోజులో 45 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

705 నుంచి 750కి జంప్

705 నుంచి 750కి జంప్

కర్ణాటకలో గురువారం వరకు 705 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. శుక్రవారం అధికారుల విడుదల చేసిన లెక్కల ప్రకారం 705 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 750కి చేరింది. బెంగళూరులో 7, ఉత్తర కన్నడ జిల్లాలో 12, దావణగెరెలో 14, బెళగావిలో 11, బళ్లారిలో ఒక కేసు నమోదైనాయి.

బెంగళూరులో 163 కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరులో 163 కరోనా పాజిటివ్ కేసులు

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గురువారం బెంగళూరులో కరోనా వైరస్ కేసుల సంఖ్య 156 ఉంటే శుక్రవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 163కు చేరింది. ఒక్కరోజులో బెంగళూరులో 7 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి.

మూడు జిల్లాల్లో 37 కేసులు

మూడు జిల్లాల్లో 37 కేసులు

కర్ణాటకలో ఒక్కరోజులో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అయితే మూడు జిల్లాల్లో 37 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. దావణగెరె, ఉత్తర కన్నడ, బెళగావి జిల్లాల్లో ఒక్కరోజులో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ మూడు జిల్లాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

25 మంది మహిళలు, 7 మంది పిల్లలు

25 మంది మహిళలు, 7 మంది పిల్లలు

కర్ణాటకలో ఒక్కరోజు నమోదైన 45 కరోనా పాజిటివ్ కేసుల్లో 24 మంది మహిళలకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. అంతే కాకుండా ఐదు నెలల పసిపాపతో పాటు 10 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆరు మంది పిల్లలకు కరోనా వైరస్ సోకిందని అధికారులు వివరాలు వెళ్లడించారు.

పేషంట్ నెంబర్: 533 దెబ్బకు 10 మందికి కరోనా

పేషంట్ నెంబర్: 533 దెబ్బకు 10 మందికి కరోనా

కర్ణాటకలోని దావణగెరెలో ఒక్కరోజులో 14 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అందులో పేషంట్ నెంబర్: 533 వ్యక్తి వలన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు అంటున్నారు. అదే విదంగా పేషెంట్ నెంబర్: 566 వ్యక్తి నుంచి నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు అన్నారు. ఒక్కరి వలన 10 మందికి, మరో వ్యక్తి వలన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో ఆ ఇద్దరు పేషంట్లతో సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు ఎక్కడ మాకు కరోనా వస్తుందో ? అనే భయంతో హడలిపోతున్నారు.

English summary
Bengaluru: 45 Coronavirus Positive Cases Found In Single Day in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X