COVID-19: కరోనా టెన్షన్, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య, ఫ్యామిలీ భయంతో !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తనకు ఎక్కడ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తుందో ?, నా కుటుంబ సభ్యులు ఎక్కడ నన్ను దూరం పెడుతారో ? అనే ఆవేదనతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆసుపత్రిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బెంగళూరు సిటీలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

కరోనా అని అనుమానంతో ?
బెంగళూరు నగరంలోని విజయనగరలో సమీపంలో నివాసం ఉంటున్న 61 ఏళ్ల వ్యక్తి శుక్రవారం అనారోగ్యానికి గురైనాడు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు విజయనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చెయ్యడం మొదలుపెట్టారు.

కరోనా వస్తుందని భయంతో ఆత్మహత్య
తనకు ఎక్కడ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తుందో ?, నా కుటుంబ సభ్యులు ఎక్కడ నన్ను దూరం పెడుతారో ? అనే ఆవేదనతో చికిత్స పొందుతున్న వ్యక్తి సతమతం అయ్యాడు. వైద్యులు చికిత్స చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించి రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయారు. తరువాత ఆసుపత్రిలోని ఫ్యాన్ కు ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ్యామిలీకి షాక్
మందులు ఇవ్వడానికి నర్సులు రూమ్ లోకి వెళ్లిన సమయంలో కరోనా వైరస్ సోకిన అనుమానిత రోగి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, బీబీఎంపీ అధికారులు పరిశీలించి ఆయన శవాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

ఐటీ హబ్ లో కరోనా మరణాల రికార్డ్ బ్రేక్
శుక్రవారం కర్ణాటకలో కరోనా వైరస్ దెబ్బకు 190 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందుకే బెంగళూరులో మాత్రమే 124 మంది కోవిడ్ కు బలికావడంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోతున్నారు. గత 24 గంటల్లో కర్ణాటకలో మొత్తం 26, 962 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో గత 24 గంటల్లో 16, 662 మందికి కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోతున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications