వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకి

|
Google Oneindia TeluguNews

మహమ్మారి పట్ల సర్వత్రా ఆవహించిన అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృభిస్తోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ.. పాత రికార్డులను తిరగేస్తోంది. ఒకే రోజులో కొత్త కేసుల విషయంలో రెండు నెలల తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులూ పైపైకి వెళుతున్నాయి. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి..

కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7.37లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా, కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన ఐదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ, ఇవాళ రెండు నెలల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఒక రోజు కొత్త కేసులు 19 వేలకు చేరువగా నమోదుకాగా, మళ్లీ నిన్న (మార్చి 6న) అదే స్థాయిలో కేసులు వచ్చాయి. కొత్తవాటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1కోటి, 12లక్షల,10వేల, 799కి పెరిగాయి. ఇక

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంviral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,756కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.41 శాతంగా కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పైపైకి వెళుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,523 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా,

covid-19:another spike in india, 18,711 new cases, 100 deaths in 24 hrs, Active Cases Rise Again

గడిచిన రెండు నెలలుగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుండగా, గడిచిన వారం రోజుల్లో సీన్ రివర్స్ అయింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 18,711 కేసులు నమోదుకాగా, కొత్తగా 14,392 మంది కొవిడ్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,08,68,520కు చేరింది. మొన్నటిదాకా దాదాపు 98 శాతంగా ఉన్న రికవరీ రేటు క్రమంగా పడిపోతోంది. దేశంలో రికవరీ రేటు 96.95 శాతానికి తగ్గిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు..

చంద్రబాబుకు రాజధాని సెగ -విశాఖలో చేదు అనుభవం -జగన్ దెబ్బకు నగరాలు పతనంచంద్రబాబుకు రాజధాని సెగ -విశాఖలో చేదు అనుభవం -జగన్ దెబ్బకు నగరాలు పతనం

కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండగా, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 2,09,22,344కి చేరింది. ఇటీవల రెండో దశ టీకా ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

English summary
The active cases registered an increase for the fifth consecutive day and the COVID-19 active caseload increased to 1,84,523 which now comprises 1.65 per cent of the total infections. The recovery rate has dropped further to 96.95 per cent, the union health ministry data stated. A total of 18,711 new infections were registered in a day, while the death toll increased to 1,57,756 with 100 daily new fatalities, the data updated at 8 am showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X