వ్యాక్సిన్ తీసుకున్న అద్వానీ, స్టాలిన్ -రణబీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. భారత మాజీ ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ వెటరన్ లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నారు. 93ఏళ్ల అద్వానీ మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు..

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఇవాళ కొవిడ్ టీకా తీసుకున్నారు. 68ఏళ్ల స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు. ఆయన పార్టీకే విజయావకాశాలున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..

covid-19:BJP leader LK Advani, DMKs MK Stalin took vaccine; Ranbir Kapoor tests positive

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కొవిడ్ బారిన పడ్డారు. మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందని రణబీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రణబీర్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అదే వేగంతో సాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కొత్తగా 15,388 కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. సోమవారం నాడు అత్యధికంగా 20,19,723 మంది టీకాలు వేసుకోగా, మొత్తంగా వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 2,30,08,733కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+