పెరుగుతున్న కరోనా ఉద్ధృతి - అలర్ట్ కావాల్సిందే..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. యాక్టివ్ కేసులు సంఖ్య 50 వేలను దాటింది. కొత్తగా 10,753కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది కరోనాకు బలయ్యారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే మాస్క్ ను తప్పనిసరి చేశాయి. కొవిడ్ కారణంగా ఇప్పటివరకు 5 లక్షల 31 వేల 91 మంది మరణించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారంతో పోలిస్తే కాస్త కేసుల తగ్గాయి. తాజా కేసులతో కలిపి మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కు పెరిగింది. ఢిల్లీలో ఆరు మరణాలు, మహారాష్ట్రలో నాలుగు, రాజస్థాన్‌లో మూడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ , ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78గా, రికవరీ రేటు 98.69 వద్దగా ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో కొవిడ్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ కీలక అంశాలు వెల్లడించారు. కోవిడ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసారు. మే నెల 15వతేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కుకు చేరుకుంటాయని డాక్టర్ మనీంద్ర అగర్వాల్ శనివారం అంచనా వేశారు. మే నెలలో 50వేల నుంచి 60 వేల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ వెల్లడించారు.గణిత నమూనా ఆధారంగా తాను అంచనా వేశానని ప్రొఫెసర్ చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పరీక్షల సంఖ్య పెంచాలని కేంద్రం నిర్దేశించింది. కేరళలోనే క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆందోళన లేదని అధికారులు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications