కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. 1.35 కోట్ల కేసులతో ప్రపంచంలోనే నంబర్.2గా...
నిన్నటిదాకా కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్... ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. మొత్తం 13.53(1.35కోట్లు) మిలియన్ల కరోనా కేసులతో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకూ 13.45 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా.. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 31.2మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 904 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,70,179కి చేరింది.
Recommended Video

ఆ రాష్ట్రాల్లోనే 80.92శాతం కొత్త కేసులు...
ప్రస్తుతం భారత్‌లో ఉన్న యాక్టివ్ కేసుల్లో 70.82శాతం కేసులు మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,కర్ణాటక,ఉత్తరప్రదేశ్,కేరళ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నవే. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 48.57 శాతం యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ప్రతీరోజూ నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,కర్ణాటక,ఉత్తరప్రదేశ్,కేరళ,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,గుజరాత్,మధ్యప్రదేశ్,రాజస్తాన్‌ల నుంచే 80.92 శాతం కేసులు నమోదవుతున్నాయి.

ఢిల్లీలో లాక్‌డౌన్...?
ఢిల్లీలో ఆదివారం(ఏప్రిల్ 12) ఒక్కరోజే అత్యధికంగా 10,774 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది కాబట్టి... లాక్‌డౌన్ ద్వారా కరోనాను కట్టడి చేసే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ పరిష్కారం కాకపోయినప్పటికీ... హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే లాక్‌డౌన్ తప్పకపోవచ్చునని కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

టీకా ఉత్సవ్‌లో 27లక్షల మందికి వ్యాక్సిన్...
ఈ నెల 11 నుంచి 14వరకూ దేశవ్యాప్తంగా 'టీకా ఉత్సవ్' నిర్వహిస్తున్న నేపథ్యంలో... ఇప్పటివరకూ దీని ద్వారా 27లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రమంత్రి హర్షవర్దన్ తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,పంజాబ్‌లోని 50 జిల్లాల్లో కరోనా నిబంధనలు సరిగా అమలుకావట్లేదని సెంట్రల్ టీమ్ కేంద్రానికి రిపోర్ట్ చేసింది. దీంతో ఆయా జిల్లాల్లో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అక్కడి ప్రభుత్వాలను ఆదేశించింది.

మహారాష్ట్రలో కొత్తగా 63వేల కేసులు
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... ఇందులో మహారాష్ట్రలో 63,294 కేసులు,ఢిల్లీలో 10,774 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 349 మంది చనిపోగా.. ఢిల్లీలో 48 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 34,07,245కి చేరింది.ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 7,25,197కి చేరింది. ఢిల్లీలో కరోనాతో ఇప్పటివరకూ 11,283 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ 34,341 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications