వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ కేసులు నాలుగు దశలుగా: స్టేజ్-3, స్టేజ్-4కు చేరితే.. భయానకమే: ఐసీఎంఆర్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకూ విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రిండానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య రోజురోజుకూ అంచనాలకు మించిన స్థాయిలో పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులను పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 52 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వాటిని పర్యవేక్షిస్తోంది. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఙానంతో ఈ టెస్టింగ్ కేంద్రాలను నెలకొల్పింది.

కరోనా భయం: ఏపీలో మూడు చోట్ల టెస్టింగ్ కేంద్రాలు: ఎక్కడెక్కడంటే..: దేశవ్యాప్తంగా 52..!కరోనా భయం: ఏపీలో మూడు చోట్ల టెస్టింగ్ కేంద్రాలు: ఎక్కడెక్కడంటే..: దేశవ్యాప్తంగా 52..!

నాలుగు దశలుగా..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులను నాలుగు దశలుగా విభజించింది ఐసీఎంఆర్. దాని ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తోంది. మొదటి రెండు దశల్లో ఉన్న సమయంలో పేషెంట్‌కు వైద్య చికిత్సను విజయవంతంగా అందించగలిగితే.. ఇబ్బంది ఉండదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. చివరి రెండు దశలకు చేరితే.. బహుశా వైద్య చికిత్సకు పేషెంట్ శరీరం స్పందించక పోవచ్చని చెప్పారు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే పరిస్థితి చెయ్యి దాటినట్టుగా తాము భావిస్తామని బలరాం భార్గవ అంచనా వేశారు.

 Covid 19: Indias testing strategy on Coronavirus, ICMR guidlines

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions

విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే..
విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారి వల్లే భారత్‌లో మెజారిటీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బలరాం భార్గవ వెల్లడించారు. విదేశాల నుంచి భారతీయులు స్వదేశానికి రావడం, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల స్థానికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతోందని అన్నారు. ఒక్కసారి ఈ వైరస్ బయటి వారికి సోకితే..ఇక దాన్ని అదుపు తప్పినట్టుగానే భావించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడే.. ఈ వైరస్ మహ్మమ్మారిగా మారుతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.

English summary
According to officials from Ministry of Health and Family Welfare and ICMR, most cases in India can be categorised as imported cases, referring to the foreign source of the virus while some cases have been categorised as local transmission. "There are three stages of the disease. Stage I is seen through imported cases and in Stage II there is local transmission. We are not worried up till Stage 2. In Stage III, we will see community transmission and in Stage IV it becomes an epidemic," Dr.Balram Bhargava, Director General, ICMR said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X