వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్

|
Google Oneindia TeluguNews

పుట్టి 13 నెలలైన తర్వాత జన్యుపరమైన మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అగ్ర దేశాల్లో మళ్లీ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. పదులకొద్దీ దేశాలు తిరిగి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆదివారం నాటికి గ్లోబల్ గా కేసుల సంఖ్య 8కోట్లు దాటింది. మరణాల సంఖ్య 18లక్షలకు చేరువైంది. ఇటు భారత్ ను సైతం స్ట్రెయిన్ భయాలు చుట్టుముట్టాయి. లాక్ డౌన్ తొలినాళ్ల మాదిరిగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా కొనసాగుతోంది. కొత్త ఏడాదిలో ఏం జరగబోతోందననే భయాల నడుమ తాజా కరోనా లెక్కల్లో అనూహ్య గణాంకాలు నమోదయ్యాయి..

ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామ

6 నెలల కనిష్టానికి..

6 నెలల కనిష్టానికి..

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,43,368 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,732 కేసులు, 279 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా విజృంభించిన తర్వాత.. దాదాపు ఆరు నెలల వ్యవధిలో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం. మరణాలు 300లోపుగా నమోదు కావడం వరుసగా ఇది రెండో రోజు. దీంతో..

ఇవీ తాజా నంబర్లు..

ఇవీ తాజా నంబర్లు..

ఆరు నెలల్లో రోజువారీ కేసుల్లో అత్యల్పంగా 18,732 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1కోటి, 1లక్ష, 87వేల 850కి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1లక్షా, 47వేల 622కు చేరింది. మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కొత్తగా 21,430 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 97,61,538కు చేరింది. దేశంలో రికవరీ రేటు 95.82 శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,78,690కు తగ్గింది.

జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనంజడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం

కొత్త రకం కరోనా భయం పుట్టిస్తున్నా..

కొత్త రకం కరోనా భయం పుట్టిస్తున్నా..

కొత్త రకం కరోనా వైరస్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఐదు శాతం పాజిటివ్‌ కేసుల నమూనాలకు సమగ్ర జన్యు విశ్లేషణ జరపాలని కేంద్రం సంచలన ఆదేశాలివ్వడం, ఆ మేరకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ను సైతం ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన ప్రణాళికలను సైతం కేంద్రం వేగంగా అమలు పరుస్తున్నది.

చలికాంలో(ఫిబ్రవరి) వరకు కరోనా స్ట్రెయిన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరికలు వస్తున్నా, ప్రస్తుతానికి కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. జూన్, జులై నెలల్లో దేశంలో రోజువారీగా లక్ష పైచిలుకు కేసులు నమోదుకాగా, ఈ ఆరు నెలల వ్యవధిలో కనిష్ట స్థాయిలో కేసులు ఇవాళ(డిసెంబర 27న) నమోదయ్యాయి.

English summary
India on Sunday reported 18,732 new cases of Covid-19, the lowest daily figure since July 1. The fresh cases pushed the country's total coronavirus tally to 1,01,87,850. Another 279 people died due to the deadly virus, the Health Ministry figures stated. However, in what seems to be a respite in fatalities, the figures have been below 300 for two consecutive days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X