Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !

బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీ హడలిపోతుంది. వీకెండ్ లాక్ డౌన్, డే అండ్ నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడంతో సిలికాన్ సిటి ప్రజలు హడలిపోయారు. రాత్రి 9 గంటల నుంచి వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం చెప్పినా శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చిన ప్రజలు తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇక చికిత్స చేయించుకోవడానికి వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థతి మరి దారుణంగా తయారైయ్యింది. ఐటీ బీటీ సిటీలో వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ కారంగా మెట్రోరైలుకు పూర్తిగా బ్రేక్ లు పడిపోయాయి.

 ఐటీ హబ్ లో ఇది లాక్ డౌన్, కర్ఫ్యూ టైమింగ్

ఐటీ హబ్ లో ఇది లాక్ డౌన్, కర్ఫ్యూ టైమింగ్

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చెయ్యడం వదిలేసి ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ చేస్తోంది. కర్ణాటకలో నమోదు అవుతున్న కరోనా పాజటివ్ కేసుల్లో ఎక్కువ శాతం బెంగళూరులోనే నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు పూర్తి స్థాయి లాక్ డౌన్ తో పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

 రంగంలోకి మామలు

రంగంలోకి మామలు

వీకెండ్ లాక్ డౌన్ దెబ్బతో రాత్రి 9 గంటలకు మూతపడవలసిన దుకాణాలు, షాపులు శుక్రవారం మద్యాహ్నం నుంచి మూతపడటం మొదలుపెట్టాయి. బెంగళూరు సిటీలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి అమలు కావలసిన వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ శుక్రవారం మద్యాహ్నం నుంచి మొదలైయ్యింది. బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం మద్యాహ్నం నుంచి పోలీసులు రంగంలోకి దిగి అనేక ప్రాంతాల్లోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, బ్యూటీపార్లర్, జిమ్ లు, హోటల్స్ తదితర రద్దిగా ఉండే మార్కెట్ లు మూపించేశారు.

 నాలుగు రోజుల నుంచి హోటల్స్ ?

నాలుగు రోజుల నుంచి హోటల్స్ ?

బెంగళూరు సిటీలో గత నాలుగు రోజుల నుంచి హోటల్స్ లో ఎవ్వరూ కుర్చోని టిఫిన్, భోజనం చెయ్యడానికి అవకాశం లేకుండాపోయింది. కరోనా వైరస్ దెబ్బతో బెంగళూరులోని దాదాపు 99 శాతం హోటల్స్ లో కేవలం పార్శిల్స్ తీసుకెళ్లడానికి మాత్రమే అధికారులు అవకాశం ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చిన ప్రజలు హోటల్ లో కుర్చుని భోజనం చెయ్యలేక పార్శిల్ తీసుకుని రోడ్ల పక్కన నిలబడి విధిలేని పరిస్థితుల్లో భోజనం చేస్తున్నారు.

 మెట్రోరైలు బంద్

మెట్రోరైలు బంద్

బెంగళూరు సిటీలో శుక్రవారం రాత్రి నుంచి అమలు అవుతున్న వీకెండ్ లాక్ డౌన్ దెబ్బకు నమ్మ మెట్రోరైలు సంచారం పూర్తిగా నిలిపివేశారు. బెంగళూరులో కేవలం అత్యవసరాలకు మాత్రమే వాహనం సంచారానికి అనుమతి ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. బెంగళూరులో మే 4వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిం

 తేడా వస్తే తోలు తీసేస్తాం

తేడా వస్తే తోలు తీసేస్తాం

బెంగళూరులో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చినా, లేనిపోని స్టోరీలు చెబుతూ రోడ్లమీద తిరగడానికి ప్రయత్నించినా తోలు తీస్తామని పోలీసులు హెచ్చరించారు. సార్ మేము ఆ పనిమీద వెలుతున్నాము, ఈ పనిమీద వెలుతున్నామని ఎవరైనా సినిమా స్టోరీలు చెప్పడానికి ప్రయత్నిస్తే బెండ్ తీసి బొక్కలో తోస్తామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరించారు. శనివారం, ఆదివారం ఉదయం 9 గంటల వరకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చెయ్యడానికి బెంగళూరు ప్రజలకు అధికారులు అవకాశం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+