వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూచుకుందామా నీ పెతాపమో.. నా పెతాపమో: లుంగీ ఎత్తికడితే కరోనా పరార్..!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇప్పటిదాకా కేరళలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. కరోనా వల్ల కేరళ కూడా దాదాపు లాక్‌డౌన్ స్టేజీలో ఉంది. కరోనా తీవ్రత కొనసాగకుండా ఉండటానికి అనేక చర్యలను చేపట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది.

కరోనాపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి ఇప్పిటికే కేరళ పోలీసులు బ్రేక్ ద చైన్ పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను శుభ్రం చేసుకోవడంపై ఇప్పటికే కేరళ పోలీసులు ఓ డాన్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాజాగా- మరో వీడియోను వారు రిలీజ్ చేశారు. కరోనా ఎంతటి ప్రమాదకరమైనప్పటికీ.. కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల దాన్ని అవలీలగా తరిమికొట్టొచ్చనే అద్భుతమైన సందేశాన్ని ఇస్తోందా వీడియో.

Covid-19: Kerala police has released their second video as Break the Chain

తన వెంట పడిన కరోనా వైరస్‌ను ఓ మలయాళీ వ్యక్తి.. ఎలా ఎదిరించాడు? దాన్ని ఎలా తరిమికొట్టాడనే స్ఫూర్తిదాయకమైన అంశాన్ని తెరకెక్కించారు. శానిటైజర్ ద్వారా చేతులను నిర్దేశించిన ప్రమాణాల విధంగా శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వంటి చర్యల ద్వారా ప్రాణాలను తీసే శక్తిసామర్థ్యాలు ఉన్న కరోనా వైరస్‌ను కూడా తరిమి కొట్టొచ్చని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వర్షం కురుస్తోంది. పోలీసుల క్రియేటివిటీ సూపర్ అంటూ కితాబిస్తున్నారు.

English summary
The Kerala Police continues to create awareness among masses on how to fight coronavirus and minimise the chances of further spreading the deadly Covid19 with its second video ‘Break the chain’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X