కరోనా: వాహనదారులకు ఊరట - లెసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీ డిసెంబర్ 31 వరకు పొడగింపు
ఇంకో వారంలో అన్ లాక్ 4.0లోకి ప్రవేశించనున్నప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కర్యకలాపాలు మునుపటిలా వేగం పుంజుకోలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఊరటను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారుల లైసెన్స్ వ్యాలిడిటీ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో ఇప్పుడున్న పత్రాలు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు కానున్నాయి.
ఈ ఏడాది ఫ్రిబ్రవరి 1 తర్వాతో గడువు ముగిసిన లైసెన్సులు, లాక్ డౌన్ తర్వాత గడువు తీరిన పత్రాలు చెల్లుబాటవుతాయంటూ మార్చి 30న ఒకసారి, జూన్ 9న రెండోసారి కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియబోతున్నందున మరోసారి మూడు నెలల(డిసెంబర్ 31 వరకు) ఎక్స్ టెన్షన్ ప్రకటించింది. మోటర్ వెహికల్స్ యాక్ట్ 1988, సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్, 1989 ప్రకారం ఈ గడువును పొడిగించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ పేర్కొంది.

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31.55లక్షలకు, మరణా సంఖ్య 58,400కు పెరిగింది. రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, 7లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications