వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. కొత్తగా లాంబ్డా వేరియంట్, యూకేలో వెలుగులోకి.. రెండు డోసులు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రూపాంతరాలు చెందుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళన కలిగిస్తోంది. ఇటు ఫంగస్ కూడా అదేస్థాయిలో వణికిస్తోంది. కొత్తగా లాంబ్డా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కూడా యూకేలో బయటపడింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది. బయటపడ్డ వేరియంట్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరి కొత్త వేరియంట్ కూడా ఆందోళన కలిగిస్తోంది.

డెల్టా ప్లస్‌..

డెల్టా ప్లస్‌..

డెల్టా, డెల్లా ప్లస్ కోవిడ్ వేరియంట్‌ భయం ప్రపంచ దేశాలను వెంటాడుతున్నాయి. 'లంబ్డా' అనే కొత్త వేరియంట్‌‌ యూకేలో కనపించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది. గత వారం యూకేలో 99 శాతం కోవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు ఉన్నాయి. 'లంబ్డా' వేరియంట్‌కు చెందిన 6 కేసులు కనుగొన్నట్టు పీహెచ్ఈ పేర్కొంది. వీటిలో ఐదు ఓవర్‌సీస్ ట్రావెల్‌తో ముడిపడినట్టు చెబుతోంది. కొత్త వేరియంట్‌ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని తెలిపింది.

రెండుడోసుల వ్యాక్సిన్..

రెండుడోసుల వ్యాక్సిన్..

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి తాజా వేరియంట్ కారణంగా ఆసుపత్రి పాలు కాకుండా రక్షణ ఉంటుందనే అభిప్రాయాన్ని పీహెచ్‌ఈ వ్యక్తం చేసింది. దీనిపై ఇతమిత్థంగా ఒక అభిప్రాయానికి రావడానికి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. లంబ్డా వేరియంట్‌‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

 గత ఆగస్టులో..

గత ఆగస్టులో..

గ్రీక్ ఆల్ఫబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్లు పెడుతుంటుంది. లంబ్డా వేరియంట్‌ను తొలుత 2020 ఆగస్టులో పెరులో కనుగొన్నారు. అప్పటి నుంచి ప్రంపచ వ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని, ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ వీక్లీ బులిటెన్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ పెరూలో నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం లంబ్డా వేరియంట్ కేసులు ఉన్నాయని, చిలీలో గత 60 రోజుల్లో నమోదైన కేసుల్లో 32 కేసుల్లో లంబ్లా వేరియంట్ కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

English summary
covid-19 variant lambda discovered in united kingdom public health england said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X