7 రకాల కూరగాయలతో సాంబార్ రైస్.. సూపర్ టేస్టీ, హెల్దీ!
ఇంట్లో ఒక్కసారి చేస్తే అందరూ ఇష్టపడే వంటకాల్లో సాంబార్ రైస్ ఒకటి. ముఖ్యంగా 7 రకాల కూరగాయలతో తయారుచేసే ఈ సాంబార్ రైస్ చాలా రుచికరంగా, పోషకాలతో నిండి ఉంటుంది. లంచ్ బాక్స్‌కు, ఆఫీసు లేదా పిల్లలకు పెట్టి పంపటానికి తక్కువ సమయంలో తయారయ్యే ఆహారమే కాదు మంచి పౌష్టికాహారం కూడా. ఈ సాంబార్ రైస్ ను. ప్రెజర్ కుక్కర్‌లో 30 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు
కందిపప్పు: ½ కప్పు (30 నిమిషాలు నానబెట్టాలి)
కూరగాయలు: క్యారెట్, బీన్స్, మునగకాయ, వంకాయ, బంగాళదుంప, టొమాటో, సొరకాయ ముక్కలు
సాంబార్ పొడి: 2-3 టేబుల్ స్పూన్లు
చింతపండు రసం: నిమ్మకాయ సైజు (లేదా తగినంత)
బెల్లం: చిన్న ముక్క (ఆప్షనల్)
నెయ్యి లేదా నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
పోపు పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు

తయారీ విధానం
కుక్కర్‌లో నానబెట్టిన బియ్యం, పప్పు, అన్ని కట్ చేసిన 7 రకాల కూరగాయలు, 4-5 కప్పుల నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. కుక్కర్ ప్రెజర్ తగ్గాక మూత తీసి, చింతపండు రసం, సాంబార్ పొడి, బెల్లం మరియు తగినంత ఉప్పు వేసి కలపాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసి మరో 5-10 నిమిషాలు చిన్న మంటపై మరగించాలి.
ఇలా పోపు చేస్తే సూపర్ టేస్టీ సాంబార్ రైస్
చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేయించి, ఈ పోపును సాంబార్ రైస్‌లో కలిపి బాగా మిక్స్ చేయాలి. సాంబార్ రైస్ చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి కాస్త పలచగానే ఉండేలా తయారు చేసుకోవాలి.
7 కూరగాయల సాంబార్ రైస్ పోషకాల ఆహారం
పాపడ్, చల్ల మిర్చి, పచ్చడితో వడ్డిస్తే సూపర్ కాంబినేషన్. కూరగాయలు తాజాగా ఉంటే రుచి మరింత బాగుంటుంది. ఈ 7 కూరగాయల సాంబార్ రైస్ పోషకాల ఆహారం. రైస్, పప్పు, కూరగాయలు అన్నీ ఒకే దానిలో లభించడంతో పాటు, సాంబార్ ఫ్లేవర్ రుచిని మరింత పెంచుతుంది.













Click it and Unblock the Notifications