"వాళ్లను ఎవరూ ఆపలేరు..!" కాక్రోచ్ లకు మద్దతుగా మోడీ కేబినెట్ మంత్రి..!
ఎస్ఐఆర్ అక్రమాలకు నిరసనగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో మొదలుపెట్టిన నిరసనలు బెంగళూరుకు, అక్కడి నుంచి రేపు ఢిల్లీకి చేరబోతున్నాయి. వీరిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలంటూ ఢిల్లీ మెట్రో వర్గాలకు న్యూఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మొత్తం రవాణాను అడ్డుకోవడం సరికాదని హితవు పలికింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోనూ కాక్రోచ్ లపై సానుకూలత వ్యక్తమవుతోంది.
కాక్రోచ్ ల నిరసనను అఢ్డుకునేందుకు ఢిల్లీలో రైళ్లను రద్దు చేస్తూ, స్టేషన్లను మూసేస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మండిపడ్డారు. "వీరు భారతదేశ యువత-వారిని ఏదీ ఆపలేదు. ఇలాంటి అపోహలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని నేను అడుగుతున్నాను: నిజంగా ఎవరైనా ఎన్ని రైళ్లను ఆపగలరు? ఎంత అనుసంధానాన్ని అడ్డుకోగలరు? ఎన్ని రోడ్లను దిగ్బంధించగలరు? వీరు భారతదేశ యువత; గత తరాలు చేసినట్లే, ప్రపంచానికి మార్గం చూపించే సామర్థ్యం వీరికి ఉంది-అందువల్ల, వారిని ఏదీ నిలువరించలేదు." అంటూ చిరాగ్ పాశ్వాన్ తేల్చిచెప్పేశారు.

#WATCH | Sonipat, Haryana: On the cancellation of trains, Union Minister Chirag Paswan says, "These are the youth of India—nothing can stop them. To those attempting to spread such misconceptions, I ask: how many trains can anyone really stop? How much connectivity can be blocked? How many roads can be jammed? These are India's youth; they possess the capacity to show the world the way—just as previous generations have done—and so, nothing can hold them back."
— ANI (@ANI) October 9, 2026
తద్వారా కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ లను టార్గెట్ చేయడాన్ని చిరాగ్ పాశ్వాన్ తప్పుబట్టారు. ఇప్పటికే జంతర్ మంతర్ నిరసనల సమయంలో ముందు కట్టడి చేసిన కేంద్రం.. చివరికి కాక్రోచ్ లతో చర్చలు జరపడంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి పదవికి రాజీనామా కూడా చేయించింది. ఇప్పుడు కూడా కేంద్రం కాక్రోచ్ లను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో స్వయంగా మోడీ కేబినెట్ లోని మంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు కేబినెట్లో సైతం ప్రభుత్వ చర్యలపై ఉన్న అసంతృప్తిని బయటపెట్టినట్లయింది. గతంలోనూ కాక్రోచ్ లకు మద్దతుగా పాశ్వాన్ చాలా సార్లు మాట్లాడారు. యువనేత అయిన చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి కేంద్రాన్ని ఇరుకునపెడుతున్నాయి. అయినా దీనిపై స్పందించలేని పరిస్దితి మిత్రపక్షమైన బీజేపీకి, ప్రధాని మోడీకి ఎదురవుతోంది. రేపు ఢిల్లీలో నిరసనల సందర్భంగా ఈ అసంతృప్తి మరింత ఎక్కువైతే కేంద్రానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.














Click it and Unblock the Notifications
