"జనరల్ డయ్యరా ? మంగళ్ పాండేనా ?"- పోలీసులే తేల్చుకోవాలన్న కాక్రోచ్ పార్టీ..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ముంబై నుంచి ఢిల్లీ వరకూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ, దానికి అండగా నిలుస్తున్న జెన్ జీ యువత, విద్యార్దులపై పోలీసుల దాడులు పెరుగుతున్నాయి. రోడ్లపై బహిరంగ దాడుల నుంచి అరెస్టులు, నిర్బంధాల వరకూ వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (cjp) నేత అశుతోష్ రాంకా దేశవ్యాప్తంగా ఉన్న పోలీసుల్ని ఉద్దేశించి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆగ్రహం, ఆవేదన రెండూ కలగలసి ఉన్నాయి.

సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒక సందేశం అంటూ సీజేపీ నేత అశుతోష్ ఈ ట్వీట్ చేశారు. ఈ సమయంలో మీతో చేయిస్తున్నదంతా పై అధికారుల ఆదేశాల మేరకే జరుగుతోందని తమకు తెలుసన్నారు. కానీ మా పిల్లలపై మీరెలా ఇలా చేయి చేసుకోగలరు? రాత్రి చీకట్లో సామాన్య గూండాల్లా వారిని ఎలా తీసుకుపోగలరు? అంటూ ప్రశ్నించారు. దీనికి మీ మనస్సాక్షి సాక్ష్యమిస్తుందా? ఇదంతా చేయడం వల్ల మీ నైతిక విలువలకే దెబ్బ తగలడం లేదా? ఒకవేళ వీరు మీ సొంత పిల్లలైతే, మీరు వారితో ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ నిలదీశారు. బ్రిటిష్ పాలనలో కూడా, తాము కేవలం విధి నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ, తమ సొంత దేశస్థులపై కాల్పులు జరిపిన పోలీసులు కొందరు ఉన్నారని, కానీ గుర్తుంచుకోండి, ఈనాటికీ దేశం ఆ పోలీసులను దేశద్రోహులుగానే పరిగణిస్తోందని అశుతోష్ తెలిపారు.

General Dyer or Mangal Pandey CJP Questions Police Over Action Against Student Protesters

CJP Protest: బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!
CJP Protest: బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!

జూలై 20 నాటి రక్తం ఢిల్లీ పోలీసుల చేతులపై ఉంది, మీకు కూడా అదే కావాలా? అని అడిగారు. మేమంతా చదవడం, రాయడం తెలిసిన విద్యార్థులమని మీకు తెలుసని, మేము న్యాయం కోసం పోరాడుతున్నామని, మా హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. మేము గాంధీ, అంబేద్కర్ లను విశ్వసించే వారమని కూడా మీకు తెలుసన్నారు. మేము అహింసా మార్గంలో, రాజ్యాంగ మార్గంలో నడిచే వాళ్ళం, మేము చేతులు ఎత్తం, హింసకు పాల్పడమని తెలిపారు. కానీ మీరు ఏమి చేసినా, రేపు మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా జంతర్ మంతర్ చేరుకుంటామని కూడా మీరు తెలుసుకోవాలన్నారు. అలాగే దేశాన్ని కాపాడటానికి మేము ఈ చారిత్రాత్మక యుద్ధం చేస్తామన్నారు. నిర్ణయం మీదే-చరిత్రలో మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటున్నారు: జనరల్ డయ్యర్ లాగానా, లేక అమరవీరుడు మంగళ్ పాండే లాగానా? అని అశుతోష్ పోలీసుల్ని ప్రశ్నించారు.

'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+