IPL 2026: గుజరాత్ గెలుపు తో ప్లే ఆఫ్స్ లెక్కలు తారు మారు - ఇక ఈ టీంలకే ఛాన్స్..!!

IPL 2026: ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ అంచనాలు మారుతున్నాయి. మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ సస్పెన్స్ పెరుగుతోంది. ఇక.. ప్లే ఆఫ్స్ లక్ష్యంగా పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు దాటిన జట్లు ముందుకు వెళ్తున్నాయి. అయితే, ఊహించని ఫలితాలతో ఆ జట్లలోనూ టెన్షన్ మొదలైంది. తాజా గా సన్ రైజర్స్ మీద గుజరాత్ గెలుపుతో ఒక్క సారిగా లెక్కలు మారిపోయాయి. దీంతో.. ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల పైన దాదాపు స్పష్టత వస్తోంది.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా గుజరాత్ టైటాన్స్, 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. సాధారణంగా 16 పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్ స్థానం ఖాయమని భావిస్తారు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ల లెక్కల ప్రకారం, ఈ విజయం తర్వాత గుజరాత్ క్వాలిఫికేషన్ అవకాశాలు 94.9 శాతానికి పెరిగాయి. అయితే.. వెనుకే హేమా హేమీ జట్లు వరుసలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు 80 శాతంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫికేషన్ అవకాశాలు, ఘోర ఓటమి తర్వాత 65.7 శాతానికి పడిపోయాయి. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా ఒకింత ఆందోళనకరంగా మారింది. ఆ జట్టు అవకాశాలు 80.1 శాతం నుంచి 79.7 శాతానికి తగ్గినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి.

 టీడీపీ నుంచి రాజ్యసభకు ఊహించని ఎంపిక, జనసేన నుంచి ఆయనకే..!?
టీడీపీ నుంచి రాజ్యసభకు ఊహించని ఎంపిక, జనసేన నుంచి ఆయనకే..!?
ipl-playoffs-scenario-changes-after-gt-vs-srh-match-where-does-each-team-stand-explained-here

ప్లే ఆఫ్స్ పై మారుతున్న అంచనాలు

ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ మాత్రం స్వల్పంగా మెరుగుపడి 62.7 శాతానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ప్రస్తుతం 42.8 శాతంగా ఉన్నాయి. దీంతో.. ఇక జరిగే ప్రతీ మ్యాచ్ ఈ నాలుగు టీంలకు కీలకంగా మారనుంది. ప్రతీ మ్యాచ్ లో గెలవటంతో పాటుగా రన్ రేటు మరింతగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక్క టీంకు రెండు నుంచి మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కాగా.. లక్నో, ముంబాయి ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటకు వెళ్లిపోయాయి. చెన్నై లెక్క ఆసక్తిగా ఉంది. అదే విధంగా బెంగళూరు, పంజాబ్ లెక్కలు సమీకరణా లు కీలకంగా మారుతున్నాయి. ప్లే ఆఫ్స్ కు ఖాయం అని భావించిన సన్ రైజర్స్ అనూహ్యంగా గుజరాత్ చేతిలో ఓడటంతో పాటుగా రన్ రేటు తగ్గటం సమస్యగా మారుతోంది. దీంతో.. ఈ వారంలో మిగిలిన మ్యాచ్ ల తరువాత మాత్రమే అసలు ప్లే ఆఫ్స్ కు ఎవరు వెళ్తారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+