గాలి ద్వారా కరోనా :ఆ మాస్కులు వద్దు -ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లే రక్ష -అంటు వ్యాధుల నిపుణులు

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతోన్న తరుణంలో సాధారణ(బట్టతో చేసిన) మాస్కులు సురక్షితం కాదా? గాలి ద్వారానూ వైరస్ వ్యాప్తి చెందుతోన్నందున కచ్చితంగా మెడికేటెడ్ మాస్కులనే వాడాలా? అంటే అవుననే అంటున్నారు అంటు వ్యాధుల నిపుణులు. కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నదని నిరూపించే అధ్యయనాలను ప్రఖ్యాత సైన్స్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన క్రమంలో వాటిపై ప్రఖ్యాత వైద్యులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌ కీలక సూచనలు చేశారు.

క‌రోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తోందని అధ్యయనాలు నిరూపిస్తున్నందున, దానికి పరిష్కారం మామూలు బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు ధ‌రించ‌డం కంటే ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు ధ‌రించ‌డ‌మే అని డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌ సూచించారు. రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌న్నారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారాయన.

 Covid ‘airborne’: Use N95 or KN95 masks, alert every 24hrs, says Infectious Diseases expert

''గాలి ద్వారా కరోనా వ్యాప్తిపై లాన్సెట్ అధ్య‌య‌నం చూసి మనం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. క‌రోనా వైర‌స్ స్పెక్ట్రం (తుంప‌ర్ల నుంచి గాలి ద్వారా)లో వ్యాపిస్తుంద‌ని మ‌న‌కు తెలిసిందే. దీనికి ప‌రిష్కారం.. ఎన్‌95, ఒక కేఎన్95 మాస్కులు ధ‌రించ‌డ‌మే. వీటిని ఒక్కో రోజు ఒక్కొక్క‌టి వాడండి. ఒక‌టి వాడిన త‌ర్వాత దానిని పేప‌ర్ బ్యాగ్‌లో ఉంచి ఆ మ‌రుస‌టి రోజు వాడాలి. అవి పాడు కాక‌పోతే కొన్ని వారాల పాటు వాడుకోవ్చు. బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు వ‌ద్దు'' అని ఫహీమ్ యూన‌స్ పేర్కొన్నారు.

గాలి ద్వారా వైర‌స్ వ్యాపిస్తున్నంత మాత్రాన మన బ‌య‌ట ఉన్న గాలి మొత్తం క‌లుషితం అయిపోయింద‌ని కాదని, దీనర్థం వైర‌స్ గాల్లోనే ఉండే అవ‌కాశం ఉన్న‌ద‌ని డాక్టర్ యూనస్ తెలిపారు. ముఖ్యంగా నాలుగు గోడ‌ల మ‌ధ్య ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుందని, ఒక‌వేళ ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఉంటే మ‌న పార్కులు, బీచ్‌లు మాస్కులు పెట్టుకోకుండా కూడా చాలా సుర‌క్షితం అని యూన‌స్ చెప్పారు. డాక్టర్ ఫహీమ్ యూనస్ ప్రఖ్యాత మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి డీన్ గా పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+