వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ అలర్ట్: ఇంటర్నేషనల్ ప్యాసెంజర్స్ కోవిడ్ టెస్ట్ మస్ట్.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కేసుల వేళ మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్ మ్యాండెటరీ చేసింది. ఒకవేళ పాజిటివ్ వస్తే.. వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Recommended Video

Omicron Variant : Covid ‘Tsunami’ - WHO | Oneindia Telugu

మంగళవారం రాష్టద్రంలో 18,466 కేసులు వచ్చాయి. అంతకుముందు రోజు కన్నా 52 శాతం ఎక్కువ వచ్చాయి. అనుమానం ఉంటే వారిని సమీపంలో గల ఆస్పత్రులకు తరలిస్తారు. లక్షణాలు ఏర్పడితే సెవెన్ హిల్స్, బ్రిచ్ కాండీ.. లక్షణాలు లేకుంటే బీకేసీ, కంజుర్ మార్గ్ బీఎంసీ జంబో కోవిడ్ సెంటర్ వద్దకు తీసుకెళ్తారు.

 Covid test must for all international passengers landing in Mumbai airport

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆఖరు వరకు కర్ఫ్యూ.. లేదంటే స్వల్పంగా లాక్ డౌన్ విధించే సిచుయేషన్ అయితే ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. రోజు రోజుకు అయితే కేసులు మాత్రం పెరగడం కాస్తం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

English summary
Maharashtra government has made the Covid test mandatory for all international passengers arriving at Mumbai airport. If anyone is found positive, a normal RT-PCR test will be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X