వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్ వేవ్ అనివార్యం.. ఇప్పుడే పర్యాటక ప్రాంతాలు తెరవద్దు: ఐఎంఏ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయకంపితులను చేసింది. దాని ఇంపాక్ట్ మాములుగా లేదు. అయితే థర్డ్ వేవ్ అని.. అదీ పిల్లలకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు అదేం లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో మూడో ముప్పు తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్నింగ్ ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా తగ్గిందని చాలా చోట్ల విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీనిపై ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది.

మరో 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన ఐఎంఏ కోరింది. టూరిజం, యాత్ర, దైవ దర్శనాలపై ఆంక్షలు కొనసాగించాలని స్పస్టంచేసింది. అలా చేయడం వల్ల మూడో ముప్పు నుంచి కాస్త అయినా తగ్గవచ్చునని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జేఏ జయలాల్, సెక్రటరీ జనరల్ డాక్టర్ జయేశ్ లెలే లేఖ రాశారు.

 Covid third wave inevitable: IMA

మూడో వేవ్ అనేది తప్పదని.. అనివార్యం అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌ను వ్యాక్సిన్ తీసుకొని మాత్రమే ఎదుర్కొవాలని కోరింది. అలాగే పర్యాటక ప్రదేశాలు, ఇతర చోట్లకు వ్యాక్సిన్ తీసుకొని వారు తిరిగితే.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే చాన్స్ ఉందని హెచ్చరించింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
Indian Medical Association has voiced concern over mass gatherings across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X