వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సీన్: గర్భం ధరించిన వారు టీకా వేయించుకోవచ్చా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గర్భం

అరుణ ఆరునెలల గర్భవతి. కోవిడ్ టీకా వేయించుకోవడానికి ఆమెకు అపాయింట్మెంట్ దొరికింది. వేయించుకోవాలో వద్దో తెలియదు.

ప్రెగ్నన్సీలో టీకాలు వేయించుకోవచ్చా? సురక్షితమేనా?

వ్యాక్సీన్ వల్ల బిడ్డకు ప్రమాదముంటుందా? తనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?

వేయించుకోకపోతే నష్టమేమిటి? కొత్తగా వచ్చిన కోవిడ్ వ్యాక్సీన్ మాటేమిటి?

ఎన్నో సందేహాలు.

కోవిడ్ వాక్సీన్ గర్భిణీ స్త్రీలు వేయించుకోవాలా, వద్దా?

మనుషులపై కోవిడ్ వ్యాక్సీన్ ప్రభావం గురించి పెద్ద ఎత్తున జరిపిన పరిశోధనలలో వ్యాక్సీన్ సురక్షితమేనని తేలింది. కాకపోతే ఆ పరిశోధనలలో గర్భిణీ స్త్రీలను చేర్చలేదు.

అందువలన ఈ వ్యాక్సీన్, ప్రెగ్నన్సీలో సురక్షితమా కాదా అన్న విషయం గురించి పరిమితమైన సమాచారం మాత్రమే వుంది.

కొంతలో కొంత, వూరట కలిగించే విషయమేమిటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దాదాపు లక్ష మందిగర్భిణులకు కోవిడ్ వ్యాక్సీన్ అందజేశారు. వారిలో భయపడాల్సిన సమస్యలేవీ తలెత్తలేదు. వ్యాక్సీన్ సురక్షితం కాదన్న ఆధారాలేమీ దొరకలేదు.

కోవిడ్ వ్యాక్సీన్‌లో తల్లికి గానీ, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు గానీ హాని చేసే పదార్థాలు లేవు.

జంతువుల మీద చేసిన పరిశోధనలలో ఎటువంటి దుష్పరిణామాలు కనిపించలేదు. పైపెచ్చు, కోవిడ్ వాక్సీన్ లైవ్ వాక్సీన్ కాదు గనక తల్లి ద్వారా బిడ్డకు వ్యాధి సంక్రమిస్తుందన్న ఆధారమూ లేదు. అమెరికాలో గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన ఫైజర్, బయో ఎన్ టెక్, మోడర్నా వ్యాక్సీన్లు అందుబాటులో లేనపుడు, ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కూడా ఇవ్వవచ్చునని నిపుణులు తెలియజేస్తున్నారు.

గర్భ నిరోధక ఇంజెక్షన్

ప్రెగ్నన్సీలో కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవలసిన అవసరం ఏమిటి?

గర్భిణీ స్త్రీలకు కోవిడ్ సోకితే, దాని ప్రభావం ప్రభావం మరింత ప్రమాదకరంగా వుండవచ్చు.

నెలలు పెరిగే కొద్దీ, కోవిడ్ తీవ్రత ఎక్కువ కావడం గమనించారు. మూడవ త్రైమాసికంలో (28 వారాల నుండి కాన్పు వరకు ) కోవిడ్ సోకడం వల్ల వలన నెలలు నిండక బిడ్డ పుట్టే ప్రమాదం రెండు రెట్లు అధికంగా వుంది. ఇలా ప్రి మెచ్యూర్ కాన్పు కావడం వల్ల బిడ్డ పెరుగుదలపై దీర్ఘ కాలిక ప్రభావముంటుంది.

గర్భిణీ స్త్రీలకు అంతకు ముందే ఇతర ఆరోగ్య సమస్యలుంటే, ( ఊబకాయం, మధుమేహం), కోవిడ్ వల్ల మరింత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశముంటుంది.

ప్రెగ్నన్సీలో, షుగర్ వ్యాధి వచ్చిన స్త్రీలు, బరువు ఎక్కువగా వున్న (బీఎంఐ 40 కన్నా ఎక్కువ) వున్న వారు ముందుగా వ్యాక్సీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కోవిడ్ సోకే అవకాశం ఎక్కువగా వున్న స్త్రీలు: వైద్య రంగంలో పనిచేసే స్త్రీలు, కోవిడ్ రోగులకు సేవలందించే సోషల్ వర్కర్లకు వ్యాక్సీన్ వేయించుకునేందుకు ముందు అవకాశమివ్వాలి.

కోవిడ్ వ్యాక్సీన్

మ్యూనిటీ అంటే ఏమిటి?

శరీరానికి ఒక రక్షణ యంత్రాంగం వుంటుంది.

వ్యాధి కలిగించే సూక్ష్మ జీవి మన శరీరంలో ప్రవేశించినపుడు, ఆ యంత్రాంగం అప్రమత్తమవుతుంది. సూక్ష్మజీవి తాలూకు యాంటిజెన్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు యాంటీ బాడీలు తయారు చేస్తుంది.

ఆ సూక్ష్మ జీవితో పోరాటం సలుపుతుంది.

శరీరంలో యేర్పాటైన రక్షణ యంత్రాంగాన్నే రోగ నిరోధక శక్తి లేదా ఇమ్మ్యూనిటీ అంటారు.

వ్యాక్సీన్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి?

వ్యాక్సినేషన్ లేదా టీకా వేయించుకోవడం అంటే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా, శరీరంలో రోగ నిరోధక శక్తిని రోగనిరోధక శక్తిని ప్రేరేపించే ప్రక్రియ.

ఒక నిర్దిష్ట వ్యాధి పట్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తయారుచేయబడిన పదార్థాన్ని వ్యాక్సీన్ అంటారు.

వ్యాధి బారిన పడకుండా వ్యాక్సీన్లు రక్షణ కవచంలా పని చేస్తాయి.

ఇమ్యూనిటీని కలగజేసి వ్యాధి రాకుండా నిరోధిస్తాయి

ఇమ్యూనిటీ రెండు విధాలుగా వుంటుంది.

యాక్టివ్ ఇమ్యునైజేషన్ :లేబొరేటరీలో, వ్యాధి కారకమైన అంశాలను తొలగించి, సూక్ష్మజీవిని బలహీనపరచి వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వీటి వలన వ్యాధి కలగదు. యాంటీబాడీస్ తయారయి, రోగ నిరోధక శక్తి పెంపొందడానికి మాత్రమే ఇవి తోడ్పడతాయి.

పాసివ్ ఇమ్యునైజేషన్: అప్పటికే వ్యాధి వచ్చిన వారినుండి యాంటీ బాడీస్ ను సేకరించి వ్యాక్సిన్ల రూపంలో ప్రవేశపెట్టడం.

గర్భం ధరించాక ఇమ్మ్యూనిటిలో కొన్ని మార్పులొస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలా తగ్గడానికొక ప్రయోజనముంది. గర్భస్థ శిశువుని అన్యజీవిగా గుర్తించకుండా కాపాడుతుంది. తద్వారా అబార్షన్ జరగకుండా శిశువు రక్షణ పొందుతుంది.

కోవిడ్-19

ప్రెగ్నన్సీ వచ్చినపుడు వ్యాక్సినేషన్

గర్భిణులకు వ్యాక్సీన్ వేయించాల్సిన సందర్భంలో ప్రమాదం కన్నా మించి ప్రయోజనముందని భావించినపుడు వ్యాక్సీన్ వేయించడమే మంచిది.

డిఫ్తీరియా, టెటనస్ మరియు కోరింత దగ్గు, పోలియో వాక్సిన్లను 28- 32 వారాల మధ్య ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా, పుట్టిన బిడ్డలకు రెండునెలల వయసు వచ్చే వరకూ రక్షణ ఇస్తుంది.

గర్భంతో వున్న స్త్రీలకు ఇచ్చే వ్యాక్సిన్లు ఇవ్వడం వెనుకున్న లక్ష్యమేమిటంటే, ఆయా వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీస్ తల్లి నుండి బిడ్డకు అందించడమే.

గర్భిణులకు లైవ్ వ్యాక్సీన్లు వేయడం నిషిద్ధం.

గర్భిణీగా వున్నపుడు లైవ్ వ్యాక్సిన్లు వేయకూడదు. సాధారణంగా లైవ్ వ్యాక్సీన్ల వల్ల వ్యాధి రాదు. వ్యాధి నుండి రక్షించే యాంటీ బాడీస్ మాత్రమే తయారవుతాయి. లైవ్ వ్యాక్సీన్లలో వుండేది ప్రమాద రహితమైన సూక్ష్మ జీవులే అయినప్పటికీ, తల్లి దేహంలో ప్రవేశించాక, వ్యాధికారకమైన సూక్ష్మ జీవులుగా పరివర్తన చెందే అవకాశం వుంది.

గర్భంతో వున్నపుడు ఇవ్వకూడని వ్యాక్సీన్లు

  • బీసీజీ
  • మీజిల్స్
  • మమ్ప్స్
  • ర్యూబెల్లా
  • వారిసెల్లా
  • హ్యూమన్ పాపిల్లోమావైరస్

ఎంఎంఆర్ వాక్సీన్ (తడపర/చిన్నమ్మవారు, గవదబిళ్ళలు, రుబెల్లా) గర్భంతో వున్న స్త్రీలకు ఇవ్వకూడదు. కారణమేమిటంటే, గర్భంలో ఉన్న శిశువుకు అవయవలోపాలు ఏర్పడే అవకాశమున్నది గనుక. ఇది ప్రసవం తర్వాత వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత, 28 రోజుల వ్యవధిలో గర్భం దాల్చకూడదు.

గర్భిణులకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన వాక్సీన్లు

  • నిర్వీర్యం చేసిన ఫ్లూ వ్యాక్సీన్
  • కోరింత దగ్గు వ్యాక్సీన్
  • పోలియో వ్యాక్సీన్
  • డిఫ్తీరియా
  • టెటనస్

గర్భిణులకు ప్రత్యేక సందర్భాలలో ఇచ్చే వ్యాక్సీన్లు

  • హెపటైటిస్ A
  • హెపటైటిస్ B
  • మెనింజిటిస్ వ్యాక్సీన్
  • న్యూమోకోకల్ వ్యాక్సీన్
  • రేబీస్ వ్యాక్సీన్
  • యెల్లో ఫీవర్ వ్యాక్సీన్
కరోనా వ్యాక్సినేషన్

రుబెల్లా టీకా ప్రసవానంతర కాలంలో ఇవ్వాలి. ఎంఎంఆర్ వ్యాక్సీన్ ఒక మోతాదు సరిపోతుంది. పాలిచ్చే మహిళలకు కూడా ఈ టీకాను సురక్షితంగా ఇవ్వవచ్చు.

వారిసెల్లా (Varicella) వ్యాక్సీన్ : శిశువు అవయవాల పెరుగుదలపై వ్యాక్సీన్ యొక్క ప్రభావం వుంటుంది గనుక, చికెన్ పాక్స్ వ్యాక్సీన్ గర్భంతో వున్న మహిళలకు ఇవ్వకూడదు.

టైఫాయిడ్ వ్యాక్సీన్: టైఫాయిడ్ ప్రాబల్యం ఉన్న ప్రదేశాలకు వెళ్ల వలసిన పరిస్థితి ఎదురైనపుడు గర్భిణీ స్త్రీలకు నిర్వీర్యం చేసిన టైఫాయిడ్ వ్యాక్సీన్ వేయించుకోవచ్చు.

రేబీస్ వ్యాక్సీన్ : కుక్క కాటు తరువాత రేబీస్ రాకుండా నివారించేందుకు, గర్భిణీ స్త్రీ వ్యాక్సీన్ తీసుకోవలసి వస్తే, నిరభ్యంతరంగా వేయించుకోవచ్చు.

యెల్లో ఫీవర్ : గర్భిణులకు యెల్లో ఫీవర్ సోకితే, వ్యాధి తీవ్రత ఎక్కువే కాకుండా మరణించే అవకాశం వుంటుంది. యెల్లో ఫీవర్ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రయాణం అనివార్యమైతే, అంటు వ్యాధి నిపుణుడితో చర్చించిన తరువాత వ్యాక్సీన్ వేయించాలి.

పాలిచ్చే తల్లులకు వ్యాక్సీన్లు వేయించవచ్చు. ప్రమాదమేమీ లేదు. సురక్షితమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid vaccine: Can pregnant women be vaccinated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X