దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీఆర్: ఊహించినదానికంటే భారీ మెజారిటీ- క్రాస్ ఓటింగ్?
Vice President of India: ఊహించినట్టే- దేశ 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, ఇండియా బ్లాక్ కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో ఓడించారు. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు.
మొత్తం 452 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఆయనకు ఓటు వేశారు. ఈ నెల 12వ తేదీన అంటే శుక్రవారం నాడు రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటిలో 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోల్ అయ్యాయి.

బిజూ జనతాదళ్, భారత్ రాష్ట్ర సమితి, శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీలకు చెందిన సభ్యులెవరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వీరితో పాటు స్వతంత్రులు కూడా ఓటు వేయలేదు. మొత్తం 13 మంది ఎంపీలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
సీపీ రాధాకృష్ణన్ స్వరాష్ట్రం.. తమిళనాడు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనసంఘ్‌తో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ రెండింటితోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 67 ఏళ్ల రాధాకృష్ణన్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కోయంబత్తూరు నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడులో బీజేపీకి నాయకత్వం వహించారు.
1957లో తిరుప్పూర్‌లో జన్మించారాయన. కేరళకు పార్టీ ఇన్‌చార్జ్ వ్యవహరించారు. 2023లో తొలిసారిగా రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. తొలుత జార్ఖండ్, తరువాత మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కొంగు వెల్లలార్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీపీఆర్. కొంగు బెల్ట్ సాంప్రదాయకంగా ఏఐఏడీఎంకే వైపు మొగ్గు చూపే ఓటు బ్యాంక్.
ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. లోక్ సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ.. ఓటు వేశారు.
నిజానికి- ఎన్డీఏ కూటమికి ఉన్న బలం కంటే అధికంగా ఓట్లు పోల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా బ్లాక్ కు చెందిన కొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీ రాధాకృష్ణన్ ఓటు వేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications