తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది.

ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు వెలుగులోకి వస్తోన్నాయి. వివిధ ప్రీపోల్ సంస్థలు తమ అంచనా వెల్లడిస్తోన్నాయి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో మాస్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో అంచనాలు మారిపోతున్నాయి. తలకిందులు అవుతున్నాయి. తాజాగా సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీప్యాక్) తాజాగా తమిళనాడు అసెంబ్లీపై తన అంచనాలను విడుదల చేసింది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత ఈ సర్వేను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

CPAC Forecast on Tamil Nadu as this Party Poised to Power Maintains Grip Ground Level Results Speak

ఈ సర్వే ప్రకారం చూసినా డీఎంకే ఆధిపత్యం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని అధికార పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోనుంది. 2021నాటి ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమి స్వీపింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. మొత్తంగా కూటమి 159 సీట్లు గెలుచుకుని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంటుందని సీప్యాక్ అంచనావేసింది.

దీనికి గల అవకాశాలను సీప్యాక్ శాస్త్రీయబద్ధంగా విశ్లేషించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ దాదాపుగా అమలు చేయడం అతి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడింది. హామీలను అమలు చేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో చిట్టచివరి లబ్దిదారుడి వరకూ వాటిని దాదాపుగా చేర్చగలిగిందనే విషయం తమ సర్వేలో ప్రతిఫలించిందని పేర్కొంది. ఈ అంచనాకు అనుగుణంగా డీఎంకే ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు ఇప్పుడు కూడా ప్రకాశించడానికి ప్రధాన కారణం.

కరోనా లాక్‌డౌన్‌ కష్టకాలంలో స్టాలిన్ ప్రభుత్వం ప్రజలకు అసాధారణ సేవలను అందించిందని, అమ్మ క్యాంటీన్ల ద్వారా పట్టణ పేదల ఆహార భద్రత కల్పించిందని సీప్యాక్ పేర్కొంది. అలాగే రైతు-కేంద్రీకృత విధానాలు, త్వరిత ఫిర్యాదుల పరిష్కారంతో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రమంతటా 24/7 విద్యుత్ సరఫరాను అందించడం వల్ల రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒకింత సంతోషంగా ఉన్నారు.

చిన్న, వీధి వ్యాపారులు, గ్రామీణ, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రభుత్వం కల్పించింది. నగరాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, వాటి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం వంటి చర్యలు డీఎంకే.. విజయానికి బాటలు వేస్తాయి. సినీ కార్మికులకు అవసరమైన సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అసంతృప్తి కనిపించట్లేదని అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+