8 మంది సిట్టింగ్ లకు నో టికెట్- అధికార పార్టీ తొలి జాబితా: వేడెక్కిన గాడ్స్ ఓన్ కంట్రీ
ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్న కేరళ శాసనసభ ఎన్నికలకు సీపీఐ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల సంఘం తేదీలను వెల్లడించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది. పార్టీ మొత్తం 25 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండుసార్లు మాత్రమే పదవిలో ఉండాలనే నిబంధన నుండి మంత్రి కే రాజన్‌కు మినహాయింపు లభించింది. దీంతో ఆయన ఒల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు.
జీఆర్ అనిల్- నెడుమంగాడ్, జే చిన్చురాణి- చడయమంగళం, పీ ప్రసాద్- చేర్తల సహా ఇతర ముగ్గురు సీపీఐ మంత్రులు తమ ప్రస్తుత నియోజకవర్గాల నుండే ఎన్నికల బరిలోకి దిగుతారు. త్రిస్సూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పీ బాలచంద్రన్ స్థానంలో ప్రముఖ కవి, యువకళాసాహితి రాష్ట్ర అధ్యక్షుడు ఆలన్‌కోడ్ లీలాకృష్ణన్ బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పరవూర్‌లో ప్రస్తుత కైపమంగళం ఎమ్మెల్యే ఈటీ టైసన్ బరిలో దిగనున్నారు.

ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీపీఐ టికెట్ నిరాకరించింది. వీరిలో డిప్యూటీ స్పీకర్ చిట్టాయం గోపకుమార్ తోపాటు ఇ. చంద్రశేఖరన్, ఈకే విజయన్, పీ బాలచంద్రన్, సీసీ ముకుందన్, సీకే ఆశా, పీ సుపాల్, జీఎస్ జయలాల్ ఉన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం, ఇద్దరు మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వైకమ్ నుండి సీకే ఆశా స్థానంలో పీ వసంతం పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంజేరి నియోజకవర్గం నుండి ఎం ముస్తఫా సీపీఐ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
జిల్లా వారీగా సీపీఐ అభ్యర్థులు: కాసర్‌గోడ్: గోవిందన్ పల్లికాపిల్ (కాసర్ గాడ్), అడ్వొకేట్ పీ వసంతం- నాదాపురం (కోజికోడ్), అజిత్ కొలాడి- తిరూరంగడి (మలప్పురం), షఫిర్ కిజిస్సేరి- ఏర్నాడు), ఎం ముస్తఫా- మంజేరి, మహమ్మద్ ముహసిన్- పట్టాంబి (పాలక్కాడ్), అబూబక్కర్ మన్సిల్- మన్నార్‌క్కాడ్, ఆలన్‌కోడ్ లీలాకృష్ణన్- త్రిస్సూర్, కే రాజన్- ఒల్లూరు, (త్రిసూర్) బరిలో ఉన్నారు.
గీతా గోపి- నాటికళ్, కేకే వత్సరాజ్- కైపమంగళం, వీఆర్ సునీల్- కొడుంగల్లూరు. ఇడుక్కి పీర్ మేడ్ కే సలీమ్ కుమార్, కొట్టాయం వైకమ్ పీ ప్రదీప్, పతనంతిట్ట అదూర్‌కు ప్రజీ శశిధరన్ నిల్చున్నారు. ఎర్నాకుళం జిల్లాలో ఈటీ టైసన్- పరవూర్, ఎన్ అరుణ్- మూవాట్టుపుళ అభ్యర్థులుగా ఉన్నారు. అలప్పుజ జిల్లా నుండి పీ ప్రసాద్- చెర్తల, టీటీ జిస్మోన్ - హరిపాద్ పోటీ చేయనున్నారు. కొల్లం జిల్లాలో ఎంఎస్ తార- కరుణాగపల్లి, ఆర్ రాజేంద్రన్- చాత్తన్నూర్, అజయ ప్రసాద్- పునల్మర్, తిరువనంతపురంలో మనోజ్ ఎడమిన, జీఆర్ అనిల్- నెడుమంగాడ్ బరిలో నిలిచారు.












Click it and Unblock the Notifications