విలాసవంతమైన జీవితం: ఎంపీని సస్పెండ్ చేసిన సిపిఎం

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: సిపిఎంకు చెందిన ఎంపీ (రాజ్యసభ) రితబ్రత బెనర్జీని మూడు మాసాల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ నియమాలకు విరుద్దంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నందుకు గాను రితబ్రత బెనర్జీపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది.

రితబ్రత బెనర్జీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బుదవారం నాడు నిర్ణయం తీసుకొన్నప్పటికీ, పశ్చిమబెంగాల్ సిపిఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం నాడు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

CPM suspends Rajya Sabha MP Ritabrata Banerjee for lavish lifestyle

38 ఏళ్ళ రితబ్రత బెనర్జీ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుంది. కానీ, పార్టి నియమావళికి విరుద్దంగా రితబ్రత వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో రితబ్రత బెనర్జీ సోషల్ మీడియాలో ఒక ఫోటోను అప్‌లోడ్ చేశారు. ఈ ఫోటోలో ఆయన ధరించిన పెన్, వాచ్ ‌పై 24 ఏళ్ళ సిపిఎం కార్యకర్త ఒకరు అభ్యంతరాలను లేవనెత్తాడు.

దీంతో ఈ విషయం సిపిఎం‌కు ఇబ్బందిగా మారింది. ప్రవర్తనను మార్చుకోవాలని పార్టీ కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీలు రితబ్రత బెనర్జీకి సూచించాయి. ప్రవర్తనలో మార్పు రాని కారణంగా ఆయనను పార్టీ నుండి మూడు మాసాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొంది సిపిఎం.

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మహ్మద్ సలీం, కేంద్ర కమిటీ సభ్యుడు మదన్‌ఘోష్, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు మృదుల్ డే రితబ్రతపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The CPM suspended its Rajya Sabha parliamentarian Ritabrata Banerjee from the party for three months for his lavish lifestyle.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X