బహిరంగ విమర్శలతో సుప్రీం కోర్టు విశ్వసనీయత దెబ్బతింది: మాజీ జడ్జి సోథీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల బహిరంగ విమర్శలతో సర్వోన్నత న్యాయస్ధానం విశ్వసనీయత దెబ్బతిందని మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ సోధి ఆందోళన వ్యక్తం చేశారు.

సీనియర్‌ న్యాయమూర్తుల వ్యాఖ్యలతో సుప్రీం కోర్టు విశ్వసనీయత కోల్పోయింది..అది ఎంతవరకూ అన్నది అందరికీ తెలుసు..న్యాయవ్యావస్థ పట్ల ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పాదురొల్పాల్సిన అవసరం ఉందని సోధి అన్నారు.

Credibility of Supreme Court ruined, laments former top judge

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ప్రజల్లో చులకన చేసేలా నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలున్నాయని చెప్పారు.మరోవైపు ఆదివారం ఉదయం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ మనన్‌ మిశ్రా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.

బార్‌ కౌన్సిల్‌ బృందం మరో ముగ్గురు జడ్జీలు రంజన్‌ గగోయ్‌, మదన్‌ బీ లోకూర్‌, కురియన్‌ జోసెఫ్‌లతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తితోనూ భేటీ అయి న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభంపై చర్చించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Criticising the public commentary against Chief Justice Dipak Misra by four rebel Supreme Court judges, former judge RS Sodhi said that the credibility of the top court has been ruined.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి