క్రెడిట్ పాలిటిక్స్.. ఓకే రోడ్డుకు 12 గంటల్లో రెండుసార్లు శంకుస్థాపన !!

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రహదారి నిర్మాణం చుట్టూ క్రెడిట్ పాలిటిక్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఘనత కోసం ఇద్దరు ప్రజాప్రతినిధులు పోటీ పడటంతో, 12 గంటల వ్యవధిలోనే ఒకే రోడ్డుకు రెండుసార్లు శంకుస్థాపన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

రాయ్‌బరేలీలోని ఐటీఐ టర్న్ నుండి అభయదాత ఆలయాన్ని కలిపే రహదారి ఎన్నో ఏళ్లుగా శిథిలమైంది. గుంతలతో నిండిన ఆ మార్గం స్థానికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. అధికారులు స్పందించలేదు. దీంతో సామాజిక కార్యకర్త వివేక్ మిశ్రా (పల్లు), గుంతలను పూడ్చి, 15 వీధి దీపాలు ఏర్పాటు చేసి దృష్టిని ఆకర్షించారు.

credit-politics-in-uttar-praesh-that-rae-bareli-road-construction-became-talk-of-the-town-by-two-tim

వివేక్ మిశ్రా చర్యలు సమస్యకు ప్రాధాన్యతనిచ్చాయి. సోషల్ మీడియా, ప్రజల్లో చర్చతో రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది. రోడ్డు నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడంతోనే క్రెడిట్ కోసం రాజకీయ పోరు మొదలైంది.

తొలుత రాయ్‌బరేలీ సదర్ ఎమ్మెల్యే అదితి సింగ్ రహదారికి శంకుస్థాపన చేయగా, మరుసటి ఉదయం మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు శత్రుహన్ సోంకర్ కూడా అదే రోడ్డుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. 12 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలు నవ్వులాటగా మారాయి.

ఈ రాజకీయ పోరు ఉన్నప్పటికీ, ఏళ్ల ఇక్కట్లకు గురైన స్థానికులకు, భక్తులకు ఇది ఉపశమనం. నాయకుల పోటీతోనైనా రోడ్డు పనులు వేగంగా పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల క్రెడిట్ కంటే తమకు రోడ్డే ముఖ్యమని స్థానికులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+