షాక్: చెప్పుల్లో కెమెరా పెట్టి అమ్మాయిల దగ్గరికి వెళ్లి ఫొటోలు తీశాడు!

Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: ఓ యువకుడు తన వక్రబుద్ధిని చూపి కటకటాల పాలయ్యాడు. ఏకంగా కెమెరాను చెప్పుల్లో పెట్టుకుని అమ్మాయిల ఫొటోలను తీశాడు ఈ ప్రబుద్దుడు. చివరకు పోలీసులకు చిక్కి ఊసలు లెక్కపెడుతుడున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అమ్మాయిల ఫొటోలను వారికి తెలియ‌కుండా అశ్లీలంగా తీసేందుకు ఆ యువ‌కుడు చేసిన ప‌ని చూసి పోలీసులే ఆశ్చ‌ర్య‌పోయారు. చెప్పులో సెల్‌ఫోన్ పెట్టి, దాని కెమెరా ద్వారా అమ్మాయిల ఫొటోల‌ను అస‌భ్య‌కోణంలో తీసేందుకు ప్ర‌య‌త్నించాడు.

 అంతా అనుమానుస్పదమే

అంతా అనుమానుస్పదమే

వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌లోని త్రిస్సూర్‌లో జ‌రుగుతున్న కేర‌ళ క‌ల్సోత్స‌వానికి వివిధ క‌ళాశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వారిలోనిందితుడు బైజు కూడా ఉన్నాడు. ఇత‌డు ప‌దేప‌దే కాళ్ల వైపు చూస్తుండటం, అమ్మాయిలు ఎక్కువ‌గా ఉన్న చోట్ల తిరుగుతుండ‌టం, కొన్నిసార్లు చెప్పులు అమ్మాయిలున్న చోట వదిలేసి, తను దూరంగా నిలబడి, అటు వైపే చూడడం చేస్తున్నాడు.

పోలీసులకే షాక్

పోలీసులకే షాక్

ఈ క్రమంలో అక్కడే గ‌స్తీ కాస్తున్న‌ పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి అతడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత త‌మ‌దైన శైలిలో విచారించారు. అప్పుడు బైజు చెప్పిన విష‌యం విని పోలీసులు విస్మయానికి గురయ్యారు.

 ఎలా చేశాడంటే..

ఎలా చేశాడంటే..

త‌న కాలి చెప్పులో బైజు ఓ సెల్‌ఫోన్‌ను ఉంచాడు. కెమెరా పైకి క‌నిపించేలా చెప్పు రంధ్రంలో దానిని ఇమి‌డ్చాడు. ఎవ‌రైనా అనుకోకుండా త‌న కాలు తొక్కితే ఫోన్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఫోన్ చుట్టూ గ‌ట్టి స్టీల్ క‌వ‌రింగ్ కూడా చేయించాడు.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా..

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా..

అంతేగాక, ఒక‌వేళ ఫొటోలు తీసే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఫోన్‌ను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇంత తెలివిగా అమ్మాయిల ఫొటోలు తీసేందుకు బైజు చేసిన ప్ర‌య‌త్నం చూసి అక్క‌డి పోలీసులు ఆశ్చ‌ర్య‌పోయారు. త‌మ కెరీర్లో ఇలాంటి వికృత ప‌ని చూడ‌లేద‌ని పోలీసులు చెబుతున్నాు. బైజు నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని, అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lot of women will tell you that they know when they are being creeped on. Years of men trying to take their photos or videos without consent in public places has resulted in a guard which stays up 24x7 for many.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X