Betting: అందమైన భార్యను చంపేసి భర్త ఎస్కేప్, రూ. 30 లక్షలు డీల్, అసలు మ్యాటర్, అత్తారింటిలో !

బెంగళూరు/ హాసన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఉద్యోగం చెయ్యడానికి భర్త అతని భార్యతో కలిసి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నాడు. భార్యతో కలిసి చాలా సంతోషంగా జీవించిన భర్త అప్పుడప్పుడు అత్తారింటికి వెళ్లి కావలసినంత డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల భర్త ఆందోళనగా కనిపిస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్లు ఫోన్లు చేస్తుండటం, భర్త మరింత ఆందోళనకు గురికావడంతో భార్యకు అనుమానం రావడంతో గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో బెడ్ రూమ్ లో భార్య ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. భర్త మాయం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 7 ఏళ్ల క్రితం పెళ్లి

7 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటకలోని హాసన్ కు చెందిన తేజస్విని (28) అనే యువతి 7 సంవత్సరాల క్రితం మధు అనే యువకుడిని వివాహం చేసుకుంది. మధు కూడా హాసన్ కు చెందిన వాడే. వివాహం చేసుకున్న మధు, తేజస్విని దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఉద్యోగం చెయ్యడానికి మధు అతని భార్య తేజస్వినితో కలిసి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నాడు.

 టమోటో మండిలో ఉద్యోగం

టమోటో మండిలో ఉద్యోగం

బెంగళూరులోని ప్రముఖ టమోటో మండిలో మధు అకౌంటెంట్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తున్న మధు సంవత్సరం క్రితం వరకు అతని భార్య తేజస్వినితో చాలా సంతోషంగా గడిపాడు.భార్య తేజస్వినితో కలిసి చాలా సంతోషంగా జీవించిన మధు అప్పుడప్పుడు హాసన్ లోని అత్తారింటికి వెళ్లి కావలసినంత డబ్బులు తెచ్చుకుంటున్నాడు.

 బెడ్ రూమ్ లో శవమై కనిపించిన భార్య

బెడ్ రూమ్ లో శవమై కనిపించిన భార్య

గత 6 నెలల నుంచి మధు ఇంట్లో ఆందోళనగా కనిపిస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్లు ఫోన్లు చేస్తుండటం మధు మరింత ఆందోళనకు గురికావడంతో తేజస్వినికి అనుమానం రావడంతో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఆదివారం దంపతులు హాసన్ వెళ్లారు. తరువాత బెడ్ రూమ్ లో తేజస్విని ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

 క్రికెట్ బెట్టింగ్ తో రూ. 30 లక్షలు అప్పులు

క్రికెట్ బెట్టింగ్ తో రూ. 30 లక్షలు అప్పులు

తేజస్విని ఇంట్లో శవమైకనిపించిన తరువాత ఆ భర్త మధు మాయం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు బానిస అయిన మధు అప్పులు చేశాడని, అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసి వడ్డీలు కట్టాడని, ఇప్పటి వరకు రూ. 30 లక్షలు అప్పులు అయ్యాయని పోలీసులు అన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగోట్టుకున్న మధు అతని భార్య తేజస్విని పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశాడని, ఇదే విషయంలో భర్త అతని భార్యను హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+