రాజస్థాన్ సంక్షోభం: 22 లోగా బలపరీక్ష - సీఎం గెహ్లాట్ అనూహ్యం.. అవసరంలేదన్న బీజేపీ..ఆసక్తికర ట్విస్ట్
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. రెబల్ నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులుజారీ చేసిన తర్వాత.. అశోక్ గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బలనిరూపణ చేసుకోవాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు. తీరా బలపరీక్షకు సీఎం సిద్ధంకాగా.. తాము ఆ డిమాండ్ చేయనేలేదని కాషాయ నేతలు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ కీలక నేతలు బేరసారాలు నెరపిన వీడియోలపై దుమారం కొనసాగుతున్నది.
Recommended Video
వారం రోజులుగా రాజస్థాన్‌లో కొనసాగుతోన్న సంక్షోభానికి తెరదించే దిశగా సీఎం అశోక్ గెహ్లాట్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 22(బుధవారం)లోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సీఎం డిసైడైనట్లు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని సమాచారం. శనివారం గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను సీఎం కలుసుకుని, ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలను సమర్పించారు. అదే సమయంలో బలపరీక్షపైనా గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ 107 సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. టీబీపీ(2), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(2), ఆర్ఎల్డీ(1) కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి. సచిన్ పైలట్ వెంట 19 మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో నంబర్లు అటుఇటయ్యాయి. 19 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై ఇంకా స్పందించలేదు. తాడో పేడో తేల్చుకునేదుకు కాంగ్రెస్.. ఈనెల 22లోగా బలపరీక్షకు రెడీ అవుతుండగా, బల నిరూపణ చేసుకోవాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదని బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు జీసీ కటారియా అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో, ఆడియో టేపుల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని ఆయన చెప్పారు. బలపరీక్షపై కటారియా వ్యాఖ్యలను మరో ట్విస్ట్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.
అశోక్ గెహ్లాట్ సర్కారును కూల్చడానికి బీజేపీ కుట్రలకు పాల్పడిందన్న కాంగ్రెస్ నేతలు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో బీజేపీ నేత సంజయ్ జైన్ ఆడియో టేపుల్ని బయటపెట్టింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదై, జైన్‌ను అదుపులో తీసుకున్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ను కూడా వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications