వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime thriller: బ్యాంకులో 30 సెకన్లలో రూ. 10 లక్షలు లూటీ, 10 ఏళ్ల బుడ్డోడా మజాకా, మైండ్ బ్లాక్!

|
Google Oneindia TeluguNews

భోపాల్/ న్యూఢిల్లీ: పాత సినిమాల్లో బ్యాంకుల్లో తుపాకులు, కత్తులు చూపించి లక్షల రూపాయలు లూటీ చేసే సీన్లు మనం చాలానే చూశాం. ఇప్పుడు బుడంకాయ్ అంత బుడ్డోడు ఎలాంటి ఆయుధాలు లేకుండా బ్యాంకులోకి దర్జాగా వెళ్లి రూ. 10 లక్షలు లూటీ చేశాడు. రూ. 10 లక్షలు లూటీ చేసిన బుడ్డోడికి 10 ఏళ్లు కూడా నిండలేదు. కేవలం 30 సెకన్ల సమయంలోనే బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల కంట పడకుండా రూ. 10 లక్షలు లూటీ చేసిన ఆ బాలుడు ఎలాంటి భయం లేకుండా చెక్కేశాడు. సీసీటీవీ కెమెరాల్లో విషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది, పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది!Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది!

బ్యాంకులో భౌతికదూరం

బ్యాంకులో భౌతికదూరం

మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లా జవద్ ప్రాంతంలో ఓ కార్పొరేటివ్ బ్యాంకు ఉంది. ఉదయం 11 గంటల సమయంలో బ్యాంకులో కస్టమర్లతో కిటకిటలాడుతోంది. కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో బ్యాంకులో కస్టమర్లు కనీస భౌతిక దూరం పాటిస్తూ వాళ్లు వచ్చిన పని చూసుకుంటున్నారు. బ్యాంకు తీసి అరగంట మాత్రమే కావడంతో బ్యాంకు సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు.

దర్జాగా బుడ్డోడు ఎంట్రీ

దర్జాగా బుడ్డోడు ఎంట్రీ

కస్టమర్లు వెలుతున్న సమయంలో 10 ఏళ్ల బాలుడు బ్యాంకులోకి వెళ్లాడు. బ్యాంకులోకి బాలుడు వెలుతుంటే ఎవరో కస్టమర్ల పిల్లాడు వచ్చాడని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు, బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు పెద్దగా పట్టించుకోలేదు. బ్యాంకులోకి వెళ్లిన బాలుడు నేరుగా క్యాషియర్ క్యాబిన్ లోకి వెళ్లి పక్కన ఓ మూలలో నిలబడ్డాడు. బాలుడు ఎత్తు చాలా తక్కువగా ఉండటంతో నగదు డ్రా చేసుకోవడానికి క్యూలో ఉన్న కస్టమర్లు సైతం ఆ బాలుడిని గుర్తించలేకపోయారు.

ఇంతకంటే చాన్స్ రాదు

ఇంతకంటే చాన్స్ రాదు

క్యాబిన్ లో క్యాషియర్ లేకపోవడంతో బుడ్డోడు చేతివాటం చూపించాడు. క్యాష్ బాక్స్ లోని రూ. 500 నోట్ల కట్టలు చేతికి చిక్కినన్ని ఎత్తుకుని దర్జాగా క్యాషియర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు. బ్యాంకులోకి ఎలా దర్జాగా వచ్చాడో అంతే దర్జాగా బుడ్డోడు బ్యాంకులోని బయటకు వచ్చి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి నుంచి చెక్కేశాడు.

రూ. 10 లక్షల లూటీకి జస్ట్ 30 సెకన్లు

రూ. 10 లక్షల లూటీకి జస్ట్ 30 సెకన్లు

బ్యాంకులో నుంచి బాలుడు బయటకు వచ్చిన వెంటనే క్యాబిన్ లోకి వెళ్లిన క్యాషియర్ నోట్ల కట్టలు కనపడటం లేదని వెంటనే అలారమ్ ఆన్ చేశాడు. రూ. 10 లక్షలు మాయం కావడం కేవలం 30 సెకన్లలో జరిగిపోయింది. అలారమ్ మోగడంతో బ్యాంకులోని సెక్యూరిటీ గార్డు సైతం బాలుడి వెంట పరుగు తీశాడు. అయితే బాలుడు మాయగాడు కావడంతో వాడు మాత్రం చిక్కలేదు.

క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్లు!

క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్లు!

విషయం తెలుసుకున్న జావద్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి ఓపీ మిశ్రా బ్యాంకులోకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. రూ. 10 లక్షలు చోరీ చేసింది 10 ఏళ్ల బాలుడు అని తెలుసుకున్న పోలీసు అధికారులు, బ్యాంకు సిబ్బంది షాక్ కు గురైనారు. బాలుడు బ్యాంకులో చోరీ చెయ్యడానికి మరో వ్యక్తి సహకరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చోరీ చేసిన బాలుడు, మరో వ్యక్తి వేర్వేరు దారుల్లో పారిపోయారని, సీసీటీవీ క్లిప్పింగ్స్ ఆధారంగా బుడ్డోడు, బాలుడికి సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి ఓపీ మిశ్రా మీడియాకు చెప్పారు.

English summary
Crime thriller: 10 year old boy stole rs 10 lakh from bank in just 30 seconds in madhya pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X