Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల లీడర్స్ పోటీ, ఫ్యాన్సీ నెంబర్ లో రెడ్ అలర్ట్ !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు చాలా మంది పోటీ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన క్రిమినల్ కేసుల ఉన్న నాయకులతో పోల్చితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయకుల మీద ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూసింది.

2018లో అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న 83 మంది బీజేపీ నాయకుల పోటీ చేస్తే ఇప్పుడు 96 మంది పోటీ చేస్తున్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 59 మంది క్రిమినల్ కేసులు ఉన్న లీడర్స్ పోటీ చేస్తే ఇప్పుడు 122 మంది పోటీ చేస్తున్నారు. 2018లో జేడీఎస్ నుంచి 41 మంది క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు పోటీ చేస్తే ఇప్పుడు 70 మంది క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు పోటీ చేస్తున్నారు.

 111fancynumber

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు, వారి క్రిమినల్ కేసుల వివరాలు సేకరించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఈ వివరాలు బయటకు వచ్చాయి. 2018లో కంటే 2023లో పోటీ చేస్తున్న నాయకుల మీద క్రిమినల్ కేసులు ఎక్కువ నమోదు అయ్యాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

హత్య కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు అయిన 35 మంది నాయకులు, మహిళలపై దౌర్జన్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 49 మంది నాయకులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ కేసులతో పాటు మహిళ మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్క నాయకుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి క్రిమినల్ కేసులు ఉన్న 55 శాతం మంది లీడర్స్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 31 శాతం మంది మీద ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదు అయిన నాయకులు ఎన్నికల్లో పోటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది, బీజేపీ నుంచి 30 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

 bjpcongressjds-

జేడీఎస్ పార్టీ నుంచి 25 శాతం క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు స్వతంత్ర పార్టీల నాయకులు, పలు పార్టీల నాయకులు పోటీలో ఉన్నారు.

ఒకే నియోజక వర్గంలో ముగ్గురి కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు పోటీ చేస్తున్న 111 నియోజక వర్గాలు ఉండటంతో ఆ నియోజక వర్గాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్ణాటకలో 111 అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న నాయకులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆ నియోజక వర్గాల మీద అధికారులు ప్రత్యేక నిఘా వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+