అల్వార్ ఘటనపై బెహన్ జీది మొసలి కన్నీరు : మోదీ విసుర్లు
న్యూఢిల్లీ : అల్వార్ లైంగికదాడి రాజకీయ పార్టీల విమర్శకు అస్ర్తమవుతుంది. ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగిన కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ మద్దతిస్తోందా అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. రేప్ ఘటనపై దళిత ఏజెండగా ఎంచుకొన్న బీఎస్పీ ఖండిస్తే సరిపోతుందా అని నిలదీశారు. మీరు ఇంకా రాజస్థాన్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అని అడిగారు.

మొసలి కన్నీరే ..
అంతేకాదు ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ భాగస్వామ్యపక్షం బీఎస్పీ మాత్రం ఇన్సిడెంట్ ను ఖండించి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. ఈసారి రాజస్థాన్ లోని 25 లోక్ సభ సీట్లు, యూపీలోని 80 స్థానాల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు అంశాలవారీగా విమర్శిస్తూ ... రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి.

ఇంకా మద్దతా ?
యూపీ కూతురు బెహన్ జీ మాయావతి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుందా అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. షెడ్యూల్ కులాలకు చెందిన ఓ బాలిక లైంగికదాడికి గురైన మాయావతి వైఖరి మారకపోవడం కలచివేస్తోందన్నారు మోదీ. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ భాగస్వామ్య కూటమి నుంచి బీఎస్పీ బయటకు రాకపోవం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బెహన్ జీ వైఖరిని నిరసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

చర్యలేవీ ?
అంతేకాదు లైంగికదాడి ఘటనపై రాజస్థాన్ సర్కార్ ఎలాంటి చర్యలుతీసుకోలేదు. అంతేకాదు ఇతర పార్టీలు కూడా స్పందించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంతకీ రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అని మరో ట్వీట్ మోదీ ప్రశ్నించారు. రాజస్థాన్ ఘటనపై బెహన్ జీ .. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పపడుతూ ఇదివరకే ప్రకటన విడుదల చేశారు. గత నెల 26న ఘటన జరిగితే .. 30న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాజస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఇంక చర్యలు తీసుకోలేదని ... విపక్షాలు తప్పుపడుతున్నాయి. అయితే రాజస్థాన్ ప్రభుత్వం జరిగిన ఘోరాలపై గాక ... స్వార్థ ప్రయోజనాలపై ఫోకస్ చేస్తోందని మోదీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications