తుపాకితో కాల్చుకుని సీఆర్ పీఎఫ్ జవాను ఆత్మహత్య
చత్తీస్ గడ్: జీవితంపై విరక్తి చెందిన జవాను సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని సీఆర్ పీఎఫ్ అధికారులు అంటున్నారు. చత్తీస్ గడ్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని సీఆర్ పీఎఫ్ 168వ బెటాలియన్ లో పవిత్ర యాదవ్ (44) జవాను గా ఉద్యోగం చేస్తున్నాడు. బీజాపూర్ పట్టణంలోని సెంట్రల్ జైలు సమీపంలో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం పవిత్ర యాదవ్ విధులలో ఉన్నాడు.

తరువాత ఒక్క సారిగా తన దగ్గర ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకున్నాడు. తుపాకి పేలిన చప్పుడు రావడంతో సాటి జవాన్లు ఆందోళన చెంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పవిత్ర యాదవ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని బీజాపూరర్ జిల్లా ఎఎస్పీ ఇందిరా కళ్యాణ్ చెప్పారు.
అతనిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలి ప్రాంతానికి చెందిన పవిత్ర యాదవ్ చాల సంవత్సరాల నుండి ఇదే బెటాలియన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications