వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్షవాతంతో బాధపడుతున్న చిన్నారికి భరోసా.. అన్నం తినిపించిన "సైనికుడు" (వీడియో)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ : యుద్దాలు చేయడమే గాదు.. మాకు కూడా చల్లని మనసు ఉంటుందని నిరూపించాడు. సరిహద్దుల్లో కాపలాగా ఉండటమే కాదు.. మాకు కూడా మానవత్వం ఉంటుందని రుజువు చేశాడు. ఆ సీఆర్పీఎఫ్ జవాను చేసిన మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియాంక గాంధీ ఫీట్లు.. బారికేడ్ల పైనుంచి దూకి.. జనంతో కలిసి (వీడియో)ప్రియాంక గాంధీ ఫీట్లు.. బారికేడ్ల పైనుంచి దూకి.. జనంతో కలిసి (వీడియో)

సీఆర్పీఎఫ్‌ హవల్దార్‌ ఇక్బాల్‌ సింగ్‌ ఫిబ్రవరి 14వ తేదీన విధినిర్వహణలో భాగంగా సైనిక వాహనం నడుపుతున్నాడు. అదే రోజు పుల్వామాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అయితే వాహనం నడిపిస్తున్న ఇక్బాల్ సింగ్ సడెన్‌గా వాహనం ఆపారు. రోడ్డు పక్కన బిక్కుబిక్కుమంటూ చూస్తూ కూర్చున్న బాలుడి దగ్గరకు వెళ్లాడు. అతడు పెరాలిసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించాడు. ఆ క్రమంలో ఆ బాలుడికి సపర్యలు చేశాడు.

 CRPF Soldier feeds his lunch to paralytic child in srinagar

ఆకలితో ఉన్న బాలుడికి తన లంచ్ బాక్స్ తినిపించాడు. అతడి నోటి నుంచి లాలాజలం రావడంతో ఓపిగ్గా తుడిచాడు. మధ్యమధ్యలో నీళ్లు తాగిపిస్తూ అతడి ఆకలి తీర్చాడు. అయితే ఆ సన్నివేశమంతా తోటి సిబ్బంది వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. ఈ మంచి పనికి గాను ఆ సైనికుడికి గౌరవ సత్కారం లభించింది. డిస్క్ అండ్ కమాండేషన్ సర్టిఫికెట్ తో సీఆర్పీఎఫ్ అధికారులు సత్కరించడం విశేషం.

English summary
CRPF Havaldar Iqbal Singh deployed in Srinagar feeds his lunch to a paralytic child. He has been awarded with DG's Disc & Commendation Certificate for his act; He was driving a vehicle in the CRPF convoy on Feb 14 at the time of Pulwama terrorist attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X