వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోపాటు క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలపై లోక్ సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు మంగళవారం ఓ ప్రకటన చేశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు 26 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చించే అవకాశం ఉంది.
శీతాకాల సమావేశాల్లోనే మూడు కీలక ఆర్డినెన్స్ లు కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. క్రిప్టో కరెన్సీ అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీంతోపాటే బ్యాంకింగ్ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఐబీసీ సవరణ బిల్లు పలు ఇతర బిల్లులు చర్చకు రానున్నాయి.

ఇటీవల క్రిప్టోకరెన్సీ అంశంపై తొలిసారిగా పార్లమెంటరీ సంఘం సమావేశమైంది. క్రిప్టోకరెన్సీని అడ్డుకోలేమని, అయితే నియంత్రించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. అంతకుముందు ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతోనూ, ఆర్బీఐ వర్గాలతోనూ సమావేశమై చర్చించారు.
ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ బిల్లుకు ప్రాధాన్యత ఏర్పడింది. కొత్తగా ప్రవేశ పెట్టే బిల్లులో అధికారిక డిజిటల్ కరెన్సీ ఏర్పాటుకు తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు వీలు కల్పించనుందని తెలుస్తోంది. దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే క్రిప్టో కరెన్సీ, దానిని ఉపయోగించేందుకు అవసరమైన టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు కేంద్రం మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.
Recommended Video
కాగా, దేశవ్యాప్తంగా రైతులు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై అధికారికంగా ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications