టెక్ సీనియర్లకు క్యాష్ ఆఫర్: కాగ్నిజెంట్ వినూత్న విధానం

Subscribe to Oneindia Telugu
  Cognizant Technology Solutions offer : కాగ్నిజెంట్ వినూత్న విధానం

  చెన్నై: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు కోసం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మెరుగైన పనితీరు కనబర్చే ఉద్యోగులకు స్టాక్స్‌ ఆఫన్స్‌ బదులు నగదును ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను సీనియర్‌ మేనేజర్లకు, అసోసియేట్‌ డైరెక్టర్లకు తెలియజేసింది.

   క్యాష్ ఆఫర్..

  క్యాష్ ఆఫర్..

  ఈ క్రమంలో ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్ల బదులు ఉద్యోగులు నగదు తీసుకోవాలని కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. ఈ ఏడాది మొదట్లోనే ఈ కంపెనీ 3.4 బిలియన్‌ డాలర్లను వచ్చే రెండేళ్లలో తమ షేర్‌ హోల్డర్స్‌కు షేర్లు తిరిగి కొనుగోలు, డివిడెండ్ల రూపంలో అందించనున్నట్టు వెల్లడించింది.

   డివిడెంట్ కూడా..

  డివిడెంట్ కూడా..

  2017 ప్రథమ క్వార్టర్‌లోనే 1.5 బిలియన్‌ డాలర్లతో షేరును తిరిగి కొనుగోలు చేసే ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. ప్రతి క్వార్టర్‌లోనూ ఒక్కో షేరుకు 0.15 డాలర్ల డివిడెండ్‌ను ఇస్తోంది కాగ్నిజెంట్.

   వాలంటరీ సెపరేషన్ స్కీమ్..

  వాలంటరీ సెపరేషన్ స్కీమ్..

  బైబ్యాక్‌ను ప్రకటించే ముందే కంపెనీ పలువురు సీనియర్‌ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేసింది. అంతేకాక బోర్డులో మార్పులు, ఫైనాన్సియల్‌ కమిటీ ఏర్పాటు వంటి ప్రక్రియలను చేపట్టింది.

   బైబ్యాక్ సంస్కరణలు..

  బైబ్యాక్ సంస్కరణలు..

  కాగా, ఇది ఒక ఆసక్తికరమైన అభివృద్ధి అని ఎవరెస్ట్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పీటర్ బెండోర్ శామ్యూల్ అన్నారు. ఈక్విటీ మంజూరు, స్టాక్ ఆప్షన్స్ అత్యుత్తమ ఈక్విటీని విలీనం చేస్తాయని, వీటిని నగదుకు మార్చడం ద్వారా వీరు స్టాక్ బైబ్యాక్‌ సంస్కరణను సాధించగలిగారని ఆయన వివరించారు. ఇది ఇలావుంటే, సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో సంస్థ భారీ లాభాలను నమోదు చేయడం గమనార్హం. లాభాలు భారీ జంప్‌ చేశాయి. అలాగే వచ్చే ఏడాదికి 10శాతం గైడెన్స్‌ అంచనా నిర్ణయించడం విశేషం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cognizant Technology Solutions (CTS) has asked high performing employees in certain bands to take cash instead of granting stock options as is the norm. In a communication sent to senior managers and associate directors who were rated EA (Exceeds All), the company has asked them to take cash instead of taking employee stock options citing reasons of the buyback program it has embarked upon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి