బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇంటికి తీసుకెళ్లి.. , ఓ కస్టమ్స్ అధికారి బాగోతం

సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇంటికి తీసుకెళ్లి ఓ కస్టమ్స్ అధికారి ఆమెపై అత్యాచారం జరిపాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపిన ఓ కస్టమ్స్ అధికారి బాగోతం బెంగళూరులో వెలుగు చూసింది.

బెంగళూరు నగర శివార్లలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న హేమరాజ్ గుర్జార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి యలహంకలోని అతడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Customs official booked on rape charge in Bengaluru

కస్టమ్స్ అధికారి హేమరాజ్ గుర్జార్ కు ఇప్పటికే వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలిందని, ఇవేమీ తనకు చెప్పకుండా.. తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించాడని సదరు మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ పీఎస్ హర్ష తెలిపారు.

English summary
Bengaluru: A Customs official has been booked on the charge of sexually assaulting a CISF woman constable who works at the city airport, police said on Monday. "We have filed an FIR against Customs officer Hemaraj Gurjar, on a complaint by the victim that he had sexually exploited her after promising to marry her but backed out later," Bengaluru North-East Deputy Commissioner of Police P.S. Harsha told IANS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X