స్మార్ట్‌ఫోన్లల్లో హ్యాకింగ్ డివైస్: సైబర్ నిపుణులు: సుప్రీంకోర్టు కమిటీకి సాక్ష్యాలు: కలకలం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ కలకలం రేపుతోంది. అధికార ఎన్డీఏ కూటమిని రాజకీయంగా కార్నర్ చేయడానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇది అందివచ్చిన అవకాశంగా మారింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది ప్రచారాస్త్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

స్మార్ట్‌ఫోన్లల్లో పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ డివైస్‌ను వినియోగించారడానికి కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించామని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలను తాము గుర్తించినట్లు వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ సమక్షంలో తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పిటీషనర్లు చేస్తోన్న వాదనలను వారు బలపరిచారు. తమ ఫోన్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేశారంటూ పిటీషనర్లు వినిపిస్తోన్న వాదనలతో ఏకీభవించారు.

కేంద్ర ప్రభుతం పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించి- దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్థిక నిపుణులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసిందంటూ గత ఏడాది మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు బిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని వినియోగించినట్లు ఆ కథనాలు స్పష్టం చేశాయి.

Cyber security researchers found concrete evidence of use of the Pegasus on the Phones of petitioners

దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ జరిపించడానికి స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులు ఉన్న ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్ సారథ్యాన్ని వహిస్తున్నారు. ఈ కమిటీ ముందు- సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు హాజరయ్యారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలను అందజేశారు.

Recommended Video

    Do You Know About This Super Women In The Republic Day Parade ? | Oneindia Telugu

    పిటీషనర్ల వాదనలు నిజమేనని తేల్చారు. ఏడుమంది పిటీషనర్లు వినియోగించిన ఐఫోన్లను ఈ పెగాసస్ స్పైవేర్‌ ద్వారా హ్యాక్ చేశారనడానికి బలమైన సాక్ష్యాధారాలను గుర్తించామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫోరెన్సిక్ విశ్లేషణలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీకి అందజేశారు. 2018 ఏప్రిల్‌లో పెగాసస్ ద్వారా హ్యాక్ చేసినట్లు తేలిందని అన్నారు. గత ఏడాది మార్చి, జూన్, జులైలల్లోనూ మాల్‌వేర్ ప్రభావానికి వారి ఫోన్లు గురైనట్లు తెలిపారు. మిగిలిన పిటీషనర్లు వినియోగించిన ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లపైనా పెగాసస్‌ను ప్రయోగించినట్లు తేలిందని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+