Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిపార్జోయ్ తుపాను బీభత్సం: భారీ వర్షాలు, గాలులతో నేలకూలిన చెట్లు, పోల్స్, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు

గాంధీనగర్: బీపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రం బీభత్సం సృష్టిస్తోంది. బిపార్జోయ్ తుఫాను గురువారం సాయంత్రం 6.30 గంటలకు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గుజరాత్ తీరాన్ని తాకింది. గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కాగా, తీరప్రాంతాల్లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలోని ద్వారక, జామ్‌నగర్, మోర్బి, రాజ్‌కోట్, పోర్‌బందర్, జునాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్, బోటాడ్, సురేంద్రనగర్, అహ్మదాబాద్‌లోని కొన్ని ప్రాంతాలపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.

బైపార్జోయ్ తుఫాను చుట్టూ తాజా పరిణామాలు:

తుఫాను గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలులకు అనేక చెట్లు నేలకూలాయి.ఈ ఘటనల్లో కనీసం ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. తుఫాను గురువారం సాయంత్రం కచ్ తీరంలో తీరాన్ని తాకడంతో విధ్వంసక గాలులు, ఎడతెరిపిలేని వర్షపాతం తోడైంది. దీంతో అనేక తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

 Cyclone Biparjoy: Strong Winds, Heavy Rains in Gujarat; Trees, Electric Poles Uprooted

కచ్ జిల్లాలోని జఖౌ, మాండ్వి పట్టణాల సమీపంలో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు ఈదురు గాలుల ధాటికి ఇంటి నిర్మాణంలో ఉపయోగించే టిన్‌ షీట్‌లు ఎగిరిపోయాయి. ద్వారకలో గోడలు కూలినట్లు నివేదికలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో పలువురు గాయపడ్డట్లు తెలిసింది.

గురువారం రాత్రి 7 గంటల వరకు, ఎటువంటి మరణాలు సంభవించలేదని గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. దేవభూమి ద్వారకా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు చెట్లు పడిపోవడంతో గాయపడ్డారని, ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. గుజరాత్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఆర్మీతో కూడిన బృందాలు ద్వారక అంతటా నేలకొరిగిన చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాయి.

కాగా, గుజరాత్ తీరం వెంబడి ఉన్న ద్వారక, ఓఖా, నలియా, భుజ్, పోర్ బందర్, కాండ్లా ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. అహ్మదాబాద్‌లోని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి మాట్లాడుతూ.. "ప్రస్తుతం, గాలి వేగం గంటకు 115 నుంచి 125 కిమీ మధ్యలో ఉంది, ఇది గంటకు 140 కిమీ వేగంతో కూడా వీస్తాయన్నారు. అర్ధరాత్రి నాటికి గాలి వేగం తగ్గవచ్చన్నారు.

శుక్రవారం ఉదయం నుంచి గాలి వేగం తగ్గుతుంది. ఉదయం నాటికి తుపాను వేగం గంటకు 70 కి.మీ-80 కి.మీలకు తగ్గే అవకాశం ఉంది. "రేపు (జూన్ 16) మధ్యాహ్నానికి బిపార్జోయ్ తుఫాను అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. దాని వేగం కనిష్టంగా గంటకు 40 కి.మీ కంటే తక్కువకు తగ్గుతుంది' అని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ బుందేలా చెప్పారు.

ఇప్పటి వరకు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వారిలో సగం మంది ఒక్క కచ్ జిల్లా నుంచే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, ప్రధానంగా కచ్‌లో 18 బృందాలను మోహరించింది. SDRF, సైన్యం, BSF కూడా తరలింపు, రెస్క్యూ, సహాయక చర్యలకు మద్దతుగా బృందాలను మోహరించారు.

సైక్లోన్ బిపార్జోయ్ ల్యాండ్ ఫాల్ కు ముందు, గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు శుక్రవారం వరకు నిలిపివేయబడ్డాయి. జూన్ 14 మధ్యాహ్నం 1.30 నుంచి జూన్ 16 అర్ధరాత్రి వరకు నోటమ్ (విమానయాన మిషన్లకు నోటీసు) జారీ చేయబడింది. "ప్రస్తుతం వాణిజ్య విమానాలు ఏవీ అమలులో లేవు, అత్యవసర, సహాయ విమానాలు మాత్రమే అనుమతించబడతాయి" అని జామ్‌నగర్ విమానాశ్రయ డైరెక్టర్ డీకే సింగ్ చెప్పారు. తుఫాను ప్రభావంతో 97 రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్ల షెడ్యూల్ మార్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+