వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరం దాటిన హుధుద్, విశాఖపై ప్రభావం, సిగ్నల్స్ కట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధుద్ తుఫాను విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తీరం దాటింది. ఉదయం కైలాసగిరి ప్రాంతంలో తీరం దాటిన హుధుద్ మధ్యాహ్నం పూడిమడక వద్ద తీరం దాటింది. తుఫాను తీరం దాటేకొద్ది బలహీనపడింది. కొన్ని గంటల్లో తుఫాను అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హుధుద్ తీరం దాటిన సమయంలో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయింది. ముఖ్యంగా విశాఖ పైన పెనుప్రభావం చూపింది. విశాఖలో మొబైళ్లు పని చేయాలేదు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. మొబైల్ ఫోన్లు పని చేయలేదు.

తీరం దాటుతున్న తుఫాను

హుధుద్ తుఫాను ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తీరాన్ని దాటుతోంది. ప్రస్తుతం పూడిమడక వద్ద హుధుద్ తీరం దాటుతోంది. మరో గంటలో తుఫాను పూర్తిగా తీరం దాటనుంది. ఆరు గంటల్లో తుఫాను తీవ్రత తగ్గనుంది. గాలుల తీవ్రత కూడా తగ్గనుంది. విశాఖలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఐఎండీ తెలిపింది. రేపటి నుండి విమాన సర్వీసులు విశాఖలో ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నెల 15వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది.

విశాఖకు 60 కిలోమీటర్ల దూరంలో..

హుధుద్ తుఫాను ఆదివారం పది గంటలకు విశాఖకు ఆగ్నేయ ప్రాంతంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇది తీరం దాడే అవకాశముంది. తీరం వెంబటి గండకు 120 నుండి 140కిలోమీటర్లతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో గాలులు అంతకంటే ఎక్కువగా ఉండనున్నాయి. కాగా, శ్రీకాకుళం సహా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకు ఒరిగాయి. కాగా, తుఫాను తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ఆ తర్వాత ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతత ఉంది కదా అని ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

దుసుకొస్తున్న హుధుద్

హుధుద్ తుఫాను దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో విశాఖలో తుఫాను తీరం దాటనుంది. ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది. హుధుద్ తీరం దాటే సమయంలో 185 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశముంది. కుంభవృష్టి కురుస్తుందని నాసా తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారి పైన ట్రాఫిక్ నిలిపివేశారు. విశాఖ పైన 18 ఏల్ల తర్వాత తుఫాను మరోసారి పంజా విసరనుంది.

హుధుద్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పైన అధికంగా ఉండనుంది. ఒడిశాలో గేట్లు ఎత్తడంతో శ్రీకాకుళంలో అప్పుడే వరదలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నారు.

కాగా, హుదుద్ తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయనగరం రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే 35 రైళ్లను రద్దు చేయడంతోపాటు మరో 31 రైళ్లను దారి మళ్లించింది. అలాగే తుఫాన్ బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో సహాయక కేంద్రాన్ని (హెల్ప్‌లైన్) ఏర్పాటు చేసింది.

Cyclone Hudhud to make landfall today; Andhra Pradesh, Odisha braces up

24 గంటలపాటు సహాయక కేంద్రంలో అధికారులను అందుబాటులో ఉంచింది. సహాయ కేంద్రంలో చీఫ్ కమర్షియల్ అధికారి సిహెచ్ రంగారావు, చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్లు డివిఎన్ రావు, కురియాకోస్, ఆర్‌పిఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ సిహెచ్‌విఆర్‌కె రావు, కేటరింగ్ ఇన్‌స్పెక్టర్లు ఎల్‌ఎస్‌జె మోహనరావు, ఎం రమేష్, ఇతర అధికారులు బిఎస్‌సి రాజు,జె పద్మజ, వి రమేష్‌లను నియమించింది.

వీరంతా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో అందుబాటులో ఉంటారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైల్వేశాఖ ముందుస్తు చర్యలు చేపట్టిన రైల్వేశాఖ, ఎవరికైనా ఏ సహాయం కావాల్సినా హెల్ప్‌లైన్ల ఫోన్ నెంబర్లకు 08922-221202, 09822-221206లకు ఫోన్ చేయాలని కోరారు.

తుఫాన్ నేపధ్యంలో రైళ్లను రద్దు చేయడంతో చాలామంది ప్రయాణికులు తమ ప్రయాణాలను మానుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి తుఫాన్ ఉగ్రరూపం దాల్చుతుందని వాతావరణ హెచ్చరిక కేంద్రం ప్రకటించిన నేపధ్యంతో విజయనగరం రైల్వేస్టేషన్‌మీదు రాకపోకలు సాగించిన 35 రైళ్లను రద్దు చేసింది.

విజయవాడ-రాయగడ, విశాఖపట్టణం-పలాస ప్యాసింజర్‌రైళ్లను కూడా రద్దు చేసింది. దీంతో విజయనగరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఘనంగా తగ్గిపోయింది. రిజర్వేషన్ కౌంటర్లు కూడా వెలవెలబోయాయి. కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

English summary
Cyclone Hudhud, said to be a 'very storm' is approximately 90 km South East of Vishakhapatnam and is likely to make landfall reassessed at North of Vizag off Bheemunipatnam by 12 pm, an agency reported on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X