ఓఖీ తుపాను దెబ్బకు 40 మంది బలి: పడవల్లో పాఠశాలలకు, విద్యుత్ శాఖ ఉద్యోగి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/తిరువనంతపురం: నవంబర్ 30వ తేదీ మొదలైన ఓఖి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తమిళనాడు, కేరళలో ఓఖీ తుపాను దెబ్బకు ఇప్పటి వరకూ 40 మంది మరణించారని అధికారులు తెలిపారు. అనేక మంది సముద్రంలో గల్లంతు అయ్యారని ఆరోపణలు ఉన్నా తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు మాత్రం ఇంకా అధికారికంగా దృవీకరించలేదు.

సముద్రంలో గల్లంతు

సముద్రంలో గల్లంతు

సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన 180 మంది మత్య్సకారులు ఇప్పటికీ గల్లంతు అయ్యారని. సముద్రంలో చిక్కుకున్న మత్య్సకారులను రక్షించడంలో తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆ రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

తమిళనాడు, కేరళ !

తమిళనాడు, కేరళ !

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన ఓఖీ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఐదు రోజుల క్రితం తమిళనాడు, కేరళ, లక్షదీప్ లో భారీ వర్షాలతో ప్రారంభమైన తుపాను క్రమంగా మహారాష్ట్ర, గుజరాత్‌ పై ప్రభావం చూపిస్తోంది.

 వాళ్లు మహారాష్ట్రకు వచ్చారు !

వాళ్లు మహారాష్ట్రకు వచ్చారు !

తమిళనాడు, కేరళ సముద్ర తీరాల్లో చేపల వేటకు వెళ్లిన 810 మంది మత్స్యకారులు వారి పడవలతో సహా మహారాష్ట్ర తీరాలకు క్షేమంగా చేరుకున్నారని కేంద్ర హోం శాఖ తెలిపింది. సముద్రంలో గల్లంతు అయిన మత్స్యకారుల కోసం గాలిస్తున్నామని తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు అంటున్నాయి.

నాగపట్నం జిల్లాలో !

నాగపట్నం జిల్లాలో !

నాగపట్నం జిల్లా వేదారణ్యం తాలూకాలోని గుండురాన్‌ వెళ్లి, వండల్ గ్రామాల్లో వందలాధి కుటుంబాలు నివాసం ఉన్నాయి. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురిసిన భారీవర్షాలకు వెణ్ణారు, నల్లారు, అడప్పారు నదుల్లోని వరద నీరు అక్కడి గ్రామాలను ముంచెత్తింది.

 పడవల్లో ప్రయాణం !

పడవల్లో ప్రయాణం !

నాగపట్నం జిల్లాలోని ప్రజలు నేటికీ పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐదు రోజుల క్రితం వరదనీరు కొంత మేర తగ్గి సహజ స్థితికి చేరుకుంటుండగా మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. దీంతో రహదారులపై అడుగుల ఎత్తులో వర్షం నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు పడవల్లో వెలుతున్నారు.

విద్యుత్ షాక్ తో ఉద్యోగి బలి

విద్యుత్ షాక్ తో ఉద్యోగి బలి

నాగర్‌కోవిల్‌ జిల్లాలోని వళ్లలార్‌ వీధిలో విద్యుత్తు సరఫరా మరత్తు పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తో వల్లన్‌ కుమారన్‌ విళై విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్‌ మెన్ గా ఉద్యోగం చేస్తున్న సెల్వరామన్‌ మరణించారని అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cyclone Ockhi has claimed 40 lives as gusty winds, coupled with heavy downpour, uprooted 590 trees and 995 electric poles in Tamil Nadu and Kerala.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X