వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తౌక్టే తుఫాను బీభత్సం: 410 మందితో సముద్రంలో కొట్టుకుపోయిన నౌకలు, వరదనీటిలో ముంబై

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంటే.. ఇప్పుడు తౌక్టే తుఫాను రూపంలో మరో విపత్తు నాలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాను ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వైపు వేగంగా పయనిస్తోంది. ముంబై తీరంలో సముద్రంలో భారీ అలలు బెంబేలెత్తిస్తున్నాయి. తీరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

Recommended Video

Cyclone Tauktae 2021 Reach Gujarat Coast On Monday Evening | Oneindia Telugu

కొట్టుకుపోయిన నౌకల

భారీగా అలలు ఎగిసిపడటంతో బాంబే హై ప్రాంతంలో తీరానికి నిలిపివున్న రెండు బార్జ్‌ల యాంకర్లు తొలగిపోయాయి. దీంతో అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. కాగా, 410 మందితో ఉన్న ఓ భారీ నౌక కూడా తుఫాను దాటికి సముద్రంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం షిప్పులలో బయల్దేరారు. 273 మంది సిబ్బందితో ఉన్న ఓఎన్జీసీకి చెందిన పీ305 బార్జ్ హీర ఆయిల్ ఫీల్డ్స్‌ను వదిలి సముద్ర నీటిపై కొట్టుకుపోయింది. దీంతో ఐఎన్ఎస్ కోచి రంగంలోకి దిగింది. కాగా, తమ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, బార్జ్ కూడా స్థిరంగా ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

137 మంది మరో నౌక..


మరోవైపు 137 మంది సిబ్బందితో ఉన్న జీఏఎల్ కన్ స్ట్రక్టర్‌కు చెందిన మరో బార్జ్ ముంబై తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయినట్లు నేవీకి సమాచారం అందింది. దీంతో ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక సహాయక చర్యల కోసం బయల్దేరింది. బార్జ్ లోని సిబ్బందికి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌకాదళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని నేవీ అధికారులు వెల్లడించారు.

భారీ వర్షంతో వరదనీటిలో ముంబై..

తౌక్టే తుఫాను కారణంగా ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వేగంగా వీస్తున్న గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సోమవారం ఆరుగురు మరణించారు. తుఫాను బీభత్సం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

తౌక్టే తుఫాను బీభత్సం..


తుఫాను కారణంగా మహారాష్ట్రతోపాటు గోవా, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. గుజరాత్ తీర ప్రాంతాల్లోని సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు సుమారు పది మంది తుఫాను బీభత్సంతో మృతి చెందారు. లక్షద్వీప్‌లో సముద్రం ఉపపొంగుతోంది. భారీ అలలు విరుచుకుపడటంతో తీర ప్రాంతాల్లోని నివాసాలన్నీ నీటమునిగాయి. ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు.

English summary
Indian Navy has dispatched ships to rescue two barges with 410 persons on board, which have gone adrift off the Mumbai coast due to Cyclone Tauktae. Barge 'P305' with 273 personnel on board is adrift off Heera Oil Fields in Bombay High area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X