Cylone Tej: దూసుకొస్తోన్న పెను తుఫాన్- అతి భారీ వర్షాలు: తేజ్గా పేరు పెట్టిన భారత్

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. వచ్చే 24 గంటల వ్యవధిలో మరింత తీవ్ర రూపాన్ని దాల్చనుంది. క్రమంగా- ఇది ఆగ్నేయ ఆసియా దేశాల వైపు కదులుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అరేబియా సముద్రంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. క్రమంగా ఇది వాయుగుండంగా మారింది. అర్ధరాత్రి దాటిన తరువాత తుఫాన్‌గా మారినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల వ్యవధిలో మరింత తీవ్ర రూపం దాల్చుతుందని పెను తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది.

Cyclone Tej lay centered over Arabian Sea

సైక్లోనిక్ ఫార్ములా ప్రకారం.. ఈ సారి తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం భారత్‌కు లభించింది. దీనికి తేజ్ (Cylone Tej) అని పేరు పెట్టింది. రాత్రి 11:30 నిమిషాలకు ఈ తుఫాన్ యెమెన్‌లోని సొకొట్రాకు 330 కిలోమీటర్లు, ఒమన్‌లోని సలాలాకు 690 కిలోమీటర్లు, యెమెన్‌లోని అల్ ఘైదాకు 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

క్రమంగా ఇది పెను తుఫాన్‌గా మారుతుందని, అరబ్ దేశాల దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం వివరించింది. ప్రస్తుతం దీని కదలిక గంటకు 4 కిలోమీటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈ నెల 25వ తేదీ తెల్లవారు జామున సలాలా- అల్ ఘైదా మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది ఐఎండీ.

దీని ప్రభావం భారత్‌పైనా ఉండబోతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం వల్ల ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అదే సమయంలో- బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమంగా వచ్చే 12 గంటల వ్యవధిలో అల్పపీడనం మారుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+