వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videos

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఫాల్(తుపాను తీరాన్ని చేరే ప్రక్రియ) ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. తుపాను తీరాన్ని పూర్తిగా దాటే ప్రక్రియ సుమారు రెండు గంటలు కొనసాగనుంది. ఈ సమయంలో భారీ విలయం తప్పదనే అంచనాలున్నాయి..

యాస్ తుపాను తీరం దాటుతోన్న సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలుల ఉధృతి మరికొద్ది గంటలపాటు కొనసాగనుంది. యాస్ తుపాను కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లో బుధవారం ఉదయం నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 Cyclone Yaas Updates: Landfall process begins as heavy rain, strong winds hit Odisha coast

యాస్ తుపాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలుకావడంతో ఒడిశా, బెంగాల్ తీరాల్లోని పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా న్యూ దిఘా వద్ద సముద్రం ఉప్పొంగింది. సునామీని తలపించేలా సముద్రపు నీరు ఊళ్లోని నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోనూ సముద్రం ఉప్పొంగి తీరంలోని ఇళ్లను, నివాస సముదాయాలను ముంచెత్తింది. అయితే ఇప్పటికే అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన దరిమిలా ప్రాణనష్టం సంభవించలేదు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో పలు రైళ్ల రద్దయ్యాయి. భారత నావికాదళం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేవీ డైవింగ్‌ బృందాలు, అవసరమైన సామగ్రి, పడవలతో ప్రత్యేక సిబ్బందితో కూడినవరద సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాలతోపాటు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Recommended Video

Cyclone Yaas Alert: సూపర్ సైక్లోన్‌గా.. Indian Army| PM Modi | Super Cyclonic Storm| Oneindia Telugu

English summary
"Very Severe Cyclonic Storm Yaas is centred about 50 km South-Southeast of Balasore (Odisha). The landfall process commenced around 9 am," India Meteorological Departement (IMD) said. the IMD has issued a red-coded warning alert for the Odisha and West Bengal coasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X