వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీ తొలగింపు వెనుక 'టాటా' షాకింగ్: ఇదీ కారణం!

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడంపై ఆ గ్రూప్ తొలిసారి అధికారికంగా మీడియాకు వివరణ ఇచ్చింది. సైరస్ మిస్త్రీ తొలగింపు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై రెండు మూడు రోజులుగా చర్చ సాగుతోంది. అసలు మిస్త్రీని ఎందుకు తొలగించారనే విషయమై పుంఖానుపుంఖాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ అధికారికంగా స్పందించింది.

ఈ అవమానంతో షాకయ్యా, నా మాట విన్లేదు: సైరస్ మిస్త్రీ ఆగ్రహంటాటా గ్రూప్‌కు చెందిన సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ సభ్యుడైన వీఆర్ మెహతా మాట్లాడారు. టాటా గ్రూప్‌లో అరవై శాతం వాటా కలిగిన ఈ ట్రస్ట్ అత్యంత శక్తిమంతమైనది. టాటా గ్రూప్ వ్యవహారాలన్నింటిలోను చాలా వరకు ఈ ట్రస్ట్ మాటే చెల్లుబాటు అవుతుంది.

దీని ట్రస్టడీ మెహతా ఓ టీవీ ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. టాటా గ్రూప్ వరుసగా ఎదుర్కొంటున్న నష్టాలే మిస్త్రీ తొలగింపుకు బలమైన కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. గ్రూపుకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎల్ఆర్ (జాగ్వార్ ల్యాండ్ రోవర్) రెండు కంపెనీల పైనే మిస్త్రీ దృష్టి పెట్టారన్నారు.

ఈ రెండు కంపెనీలు తప్ప మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇలా కంపెనీలు నష్టాల్లో ఉండటంతో ట్రస్టీ సేవా కార్యక్రమాలకు కోత పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని, దీనిని టాటాలు ఎంతమాత్రం అంగీకరించలేదని వెల్లడించారు.

Cyrus Mistry

మిస్త్రీ టాటా గ్రూప్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని, సైధ్దాంతిక ధర్మాలను ఉల్లంఘించారన్నారు. ముఖ్యంగా టెలికాం భాగస్వామి అయిన డొకొమోకు వ్యతిరేకంగా న్యాయపోరు చేయాల్సి రావడం, ఈ పోరాటంలో ఓడిపోవడం వల్ల ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల జరిమానా కట్టవలసి వచ్చిందన్నారు.

ఇది (డొకొమో కేసు) టాటాల సిద్ధాంతాలు, ధర్మాలకు అనుగుణమైనది కాదన్నారు. దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉండెనని చెప్పారు. మిస్త్రీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టాటా గ్రూప్, ట్రస్ట్ మధ్య అగాథం పెరిగిందని, ఇది కూడా తొలగింపుకు ఓ కారణమన్నారు.

మిస్త్రీకి టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్ చైర్మన్‌గా రతన్ టాటానే కొనసాగారని, ఈ సమయంలో ట్రస్ట్‌కు, గ్రూపుకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, రతన్, మిస్త్రీ భేటీ అయినప్పుడు ట్రస్ట్ గురించి చర్చించేవారని, కానీ ట్రస్ట్ వ్యక్తం చేసిన ఆందోళనలు చాలా వరకు పరిష్కరించబడలేదన్నారు. అయితే మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించిన వ్యవహారం తమకు కూడా బాధే అన్నారు.

English summary
Cyrus Mistry Gone Against Tata Ethics; Focusing on TCS, JLR Only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X