చెక్ రిపబ్లిక్ ట్రావెల్ బ్యాన్: భారత్‌లోనే చిక్కుకున్న 200 మందికిపైగా ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంపై తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. భారత్‌పై కరోనా ట్రావెల్ ఆంక్షల కారణంగా దాదాపు 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, చెక్ రిపబ్లిక్ వీసా కలిగినవారు కూడా ఆ దేశం వెళ్లలేకపోతున్నారు. ఆగస్టు 2 తర్వాత వీసాలు పొందినవారిని మాత్రమే ఆ యూరోప్ దేశానికి వెళ్లేందుకు అనుమతి ఉంది. మిగితావారు మరికొంత కాలం వేచిచూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
కరోనావైరస్ నేపథ్యంలో రక్షణాత్మక చర్యలు చేపడుతున్నామని చెక్ రిపబ్లిక్ ఎంబసీ అధికారులు తెలిపారు. చెక్ అధికారుల నుంచి లాంగ్ టర్మ్ లేదా పర్మినెంట్ లేదా టెంపరరీ రెసిడెన్స్ అనుమతులు పొందినవారు, ప్రొఫెషనల్ అథ్లెట్స్ లేదా వివిధ దేశాల తరపు ప్రతినిధులు, ఆగస్టు 2, 2021 తర్వాత లాంగ్ టర్మ్ వీసాలు పొందినవారిని మాత్రమే చెక్ రిపబ్లిక్‌లోకి అనుమతిస్తున్నట్లు వివరించారు.

2021-2022 విద్యా సంవత్సరానికి గానూ లాంగ్ టర్మ్ వీసాలు, లాంగ్ టర్మ్ రెసిడెన్సీ పర్మిట్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శృష్టి వర్మ హైదరాబాద్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని గత ఏప్రిల్‌లో వదిలేశారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కంపెనీలో ఆమెకు జూన్ చివరలో ఉద్యోగం రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ ఉండటంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం ఆమెకు కష్టంగా మారింది. ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న మొత్తంతోనే జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం అత్యవసర ప్రయాణాలను మాత్రమే అనుమతిస్తోందని, కానీ, తనకు ఉద్యోగం అవసరమని వర్మ వాపోయారు. తన తల్లిదండ్రులు, కాలేజీకి వెళ్లే తన సోదరుడు తనపైనే ఆధారపడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడేం చేయాలో తనకు తెలియడం లేదంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాను ఇప్పుడు చెక్ రిపబ్లిక్ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు వీలులేదని, మరో ఉద్యోగం కూడా వెతుక్కోలేని పరిస్థితి ఉందని వాపోయింది. వెంటనే భారత ప్రభుత్వం చెక్ రిపబ్లిక్ అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని, వీసాలు వచ్చేలా చూడాలని శృష్టి వర్మ వేడుకుంటున్నారు.
మరోవైపు చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా వీసాలు మంజూరు చేసేలా చూడాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. 'ఛేంజ్.ఓఆర్టీ'లో ఆగస్టు 8 వరకు సుమారు 600 మందికిపైగా సంతకాలు చేశారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చెక్ రిపబ్లిక్ తన కార్యకలాపాలను మనదేశంలో నిలిపివేసింది. ఇప్పుడు మనదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి మెరుపడింది. దీంతో జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, ఆస్ట్రియా, స్లోవేకియా, క్రోయేషియా లాంటి చాలా యూరోప్ దేశాలు భారత్ నుంచి వచ్చేవారిపై ఉన్న ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేశాయి. చెక్ రిపబ్లిక్ కూడా ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తే చాలా మంది భారతీయ ప్రొఫెషనల్స్, విద్యార్థులకు ఎంతో ఊరట లభిస్తుంది.
ఇది ఇలావుండగా, 29ఏళ్ల మేరీ క్యూరీ తన తల్లిదండ్రులను కలిసేందుకు ఇండియాకు వచ్చారు. ఆంక్షలతో ఇప్పుడు తిరిగి చెక్ రిపబ్లిక్ వెళ్లలేకపోయారు. తనకు ప్రెస్టిజీయస్ ఫెలోషిప్ ఉందని, తాను టెక్నికల్‌గా పీహెచ్‌డీ విద్యార్థినని చెప్పారు. తాను వర్సిటీలోనే తన విద్యను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. తాను తిరిగి వెళ్లలేని కారణంగా తను రీసెర్చ్ పెండింగ్‌లో ఉండిపోయిందని వాపోయారు.
ఝాన్సీకి చెందిన మరో 26ఏళ్ల ప్రొఫెషనల్ఉపాసన శ్రీవాస్తవ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తాను చెక్ రిపబ్లిక్‌లో ఉద్యోగం చేస్తున్నానని.. ఇప్పుడు ట్రావెల్ బ్యాన్‌తో అక్కడికివెళ్లలేకపోతున్నానిన చెప్పారు. భారత ప్రభుత్వం తమ సమస్యలను పరిగణిలోకి తీసుకోవాలని కోరుతున్నారు. చెక్ రిపబ్లిక్ దేశ అధికారులతో భారత ప్రభుత్వం మాట్లాడి తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.
మరోవైపు, చెక్ రిపబ్లిక్‌లో భారత రాయబారి హేమంత్ హెచ్ కోటల్వర్ మాట్లాడుతూ.. భారత పౌరుల సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని, ఇప్పటికే చెక్ రిపబ్లిక్ అధికారులతో చర్చలు ప్రారంభించామని తెలిపారు. ఏప్రిల్-మే నెలలో భారతదేశంలో సెకండ్ వేవ్ కారణంగా అత్యధిక కరోనా కేసులు నమోదు కావడంతో చెక్ రిపబ్లిక్.. మనదేశాన్ని తీవ్ర కరోనా ప్రమాదకర దేశాలో జాబితాలో చేర్చింది. తాము చెక్ రిపబ్లిక్ అధికారులతో మాట్లాడుతున్నామని, అక్కడికి వెళ్లాలనుకునేవారంతా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థులను అనుమతించేందుకు చెక్ రిపబ్లిక్ సుముఖత వ్యక్తం చేసిందని, మిగితా వారికి కూడా త్వరలోనే అనుమతి లభిస్తుందన్నారు.
Recommended Video
కాగా, చెక్ సాధారణ ఎన్నికలు వచ్చే అక్టోబర్ నెల మొదటివారంలో జరుగనున్నాయి. ఇక్కడ ఇప్పుడు డెల్టా వేరియంట్ వ్యాప్తి ఇప్పుడు రాజకీయాంశంగా మారింది. 10 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం 2020 నుంచి మే 2021 వరకు కరోనా కారణంగా తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. ఆ సమయంలో రోజుకు 15వేల కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కరోనాతో 30వేల మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చెక్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications